https://oktelugu.com/

Viral Video : ఆయన ఈడు ఎప్పుడో దాటిపోయింది.. పాతికేళ్ల పడుచు అతడితో జతకట్టింది.. ఇంకేముంది రచ్చ రంబోలా

ఈడు జోడు సరిగ్గా ఉంటే జంట బాగుందంటారు. వారిది అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీక అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు మీరు చదివబోయే కథనం పూర్తి విరుద్ధం. అంతేకాదు వారి వేషాలు చూస్తే.. ఇక్కడ దొరికిన సంతరా ఇది అని అనడం ఖాయం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 14, 2024 / 05:04 PM IST

    Viral Video  

    Follow us on

    Viral Video :  కాలం మారింది. మనుషుల అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. అందువల్లే ఈడు జోడు ఎవరూ చూడటం లేదు. వయసు అంతరాలను లెక్కపెట్టడం లేదు. సామాజిక మాధ్యమాలలో ఓ జంట చేస్తున్న సందడి ఎందుకు బలమైన నిదర్శనంగా ఉంది. ఆ వీడియోలో వారిద్దరు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం తీవ్రంగా ఉంది. అతడిని చూస్తే తాత వయసు లాగా ఉన్నాడు. ఆమె పాతికేళ్ల పడుచులాగా కనిపిస్తోంది. అయితే వారిద్దరు భార్యాభర్తలు కావడమే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. వారిద్దరిని చూస్తుంటే వయసును ఏమాత్రం లెక్కలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. పైగా అతడు 70 సంవత్సరాల వృద్ధుడి లాగా కనిపిస్తున్నాడు. ఆమె పాతిక సంవత్సరాల యువతి లాగా దర్శనమిస్తోంది. చూడబోతే తాతా మనవరాలి లాగా కనిపిస్తున్న వారిద్దరికీ ఎలా పెళ్లి చేశారో అర్థం కావడం లేదు.

    సోషల్ మీడియాలో కనిపిస్తున్న తీరు చూస్తే..

    సోషల్ మీడియాలో వారిద్దరూ కనిపిస్తున్న తీరు చూస్తే అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీక లాగా కనిపిస్తున్నారు. వారిద్దరి వ్యవహార శైలి చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు.. మనసులు కలిస్తే చాలు.. ఎలాగైనా బతకొచ్చు అనే దీర్ఘ కనిపిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం అందులో ఓ అమ్మాయి నీల రంగు చీర కట్టుకొని పాతిక సంవత్సరాల యువతి లాగా కనిపిస్తోంది. అతడు రంగు మారిన జుట్టు, బట్టతల.. పెరిగిన గడ్డంతో వృద్ధుడిలాగా కనిపిస్తున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అతడు ఆమెకు తండ్రి లేదా తాత లాగా ఉన్నాడు. ఆ వీడియోలో వస్తున్న పాటకు ఆ అమ్మాయి లిప్ సింక్ చేసి పాటలు పాడుతోంది. ఆ వీడియో చూస్తుంటే వారిద్దరు భార్యాభర్తలని తెలుస్తోంది. ఆ యువతి పాడుతుంటే ఆమె వెనక ఉన్న వ్యక్తి నవ్వుతున్నాడు. పైగా ఆ వీడియో క్లిప్ మీద భర్త, భార్య అనే టెంప్లేట్ కనిపిస్తోంది. వారిద్దరూ భార్యాభర్తలు అని చెప్పడానికి ఇదే నిదర్శనంగా దర్శనమిస్తోంది.

    11 మిలియన్ల వ్యూస్

    రాయ్(@itz____me_tiku__roy) అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. ఇప్పటికీ 11 మిలియన్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. రెండు లక్షల కంటే ఎక్కువ లైక్స్ సాధించింది. ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉందని.. ఆ యువతికి అన్యాయం జరిగిందని.. కొంతమంది కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం వారిద్దరు అలా వీడియో రూపొందించారని.. ఈ రోజుల్లో ఇలాంటి వివాహం ఎవరూ జరుపుకోరని.. పాతిక సంవత్సరాల యువతీ వృద్ధుడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.