Lalitha Jewelers CEO Kiran Kumar
Viral Video : సామాన్యులకైతే కష్టాలు వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లు, స్నేహితులు అండగా ఉంటారు. ధైర్యాన్ని చెబుతుంటారు. అదే శ్రీమంతులకు వస్తే అందరూ ముందుకు వస్తారు. అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లలిత జ్యువెలర్స్ (Lalitha jewellers ) తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని పేరు. నెల్లూరులో పుట్టిన కిరణ్ కుమార్ (Kiran Kumar) అనే వ్యక్తి 1985లో చెన్నై కేంద్రంగా లలిత జ్యువెల్లర్స్ ను ఏర్పాటు చేశారు. నేడది తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరించింది. తమిళనాడులోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. లలిత జ్యువెలర్స్ ఇటీవల తన కార్యాలయాన్ని ఖమ్మంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ హాజరయ్యారు. కిరణ్ కుమార్ తనకు తానే ఒక బ్రాండ్ ను గుర్తుంచుకున్నారు. డబ్బులు ఊరికే రావు అంటూ తెలుగు వారికి సుపరిచితమైపోయారు. మిగతా జువెలరీ సంస్థలు హీరోలను, హీరోయిన్లను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటే.. కిరణ్ కుమార్ మాత్రం తనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. తన సంస్థను విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే అటువంటి వ్యక్తి ఇటీవల ఖమ్మంలో ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ బ్రాంచ్ ను ప్రారంభించారు.
చెమటను తుడిచారు
లలిత జ్యువెలర్స్ అధినేత బోడి గుండుతో ఉంటారు. దానికి తగ్గట్టుగా కళ్లద్దాలు పెట్టుకుంటారు. సాధారణ డ్రెస్ లోనే కనిపిస్తారు. ఆయన ఖమ్మంలో ఇటీవల షోరూం ప్రారంభించడానికి వచ్చినప్పుడు విపరీతంగా ఎండ ఉంది. ఆ సమయంలో కిరణ్ కుమార్ గుండుకు చెమట పట్టింది. దీంతో పక్కనే ఉన్న ఒక మహిళ ఆయన గుండుకు పట్టిన చెమటను కర్చీఫ్ తో తుడిచింది. దీనిని అక్కడే ఉన్న కొంతమంది యువకులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. కిరణ్ కుమార్ సెలబ్రిటీ కావడం.. ఆయన ప్రారంభించింది లలిత జ్యువెలర్స్ కావడంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అంతేకాదు మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నెటిజన్లు ఈ వీడియో పై రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవితంలో మన గుండుకు చెమట పడితే తుడవడానికి ఒకరుంటారు లేదో తెలియదు.. కానీ కిరణ్ కుమార్ గుండుకు చెమట పడితే మాత్రం తుడవడానికి లైన్ లో చాలామంది ఉన్నారు. అందుకే డబ్బుంటేనే బాగుంటుంది. చివరికి మన గుండుకు అంటిన చెమటను కూడా ఇంకొకరు తుడవడానికి వీలుంటుంది. ఎంతైనా లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ అదృష్టవంతుడు. చివరికి తన గుండుకు పట్టిన చెమటను కూడా ఇంకొకరికి చెప్పకుండానే తుడిపించుకుంటున్నాడని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.