https://oktelugu.com/

Viral Video : సింహాలకు షాక్ ఇచ్చిన దున్న.. వీడియో వైరల్..

వైల్డ్ లైఫ్ వీడియోలు కొన్ని ఆసక్తిగా ఉంటాయి. ముఖ్యంగా జంతువుల మధ్య జరిగే పోరాటాలు మరింత గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఏ జంతువైనా ఆహారం కోసమే పోరాటం చేస్తుంది. ఒక జంతువు తన ఆకలిని తీర్చుకోవడానికి మరో జంతువుపై దాడి చేయక తప్పదు. ఈ క్రమంలో దాడి చేసే జంతువులు నుంచి బాధిత ప్రాణులు తప్పించుకొని వెళ్తుంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 7, 2024 / 06:25 AM IST

    wild ploughshare

    Follow us on

    Viral Video :  జీవితంలో రాజుగా బతకాలని కొందరు చూస్తారు. ఈ నేపథ్యంలో వారికి అడ్డు వచ్చిన వారిని అధిగమిస్తూ ముందుకు పోతారు. మిగతా వారి కంటే తామే గొప్పగా ఉండాలని అనుకుంటూ తమ కంటే చిన్న వారిని అవసరమైతే తొక్కుకుంటూ పోతారు. ఈ విషయంలో జంతువులు మహా కఠినంగా ఉంటాయి. అయితే జంతువులు ఆధిపత్యం కోసం కాకపోయినా తమ ఆకలిని తీర్చుకోవడానికి మరో జంతువుపై దాడి చేస్తాయి. ఇందులో అడవికి రాజుగా పిలిచే సింహాలు ఏ జంతువునైనా దాడి చేయడానికి వెనుకాడదు. దానికంటే పెద్దగా ఉన్న దున్నపోతునైనా నోటి కరిచి పట్టుకోగలదు. కానీ అన్నీ సమయాలు ఒకేలా ఉండవు. ఒక్కోసారి పరిస్థితులు కిందా మీద అవుతాయి. ఎప్పుడు రాజు నే గెలుస్తాడని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

    వైల్డ్ లైఫ్ వీడియోలు కొన్ని ఆసక్తిగా ఉంటాయి. ముఖ్యంగా జంతువుల మధ్య జరిగే పోరాటాలు మరింత గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఏ జంతువైనా ఆహారం కోసమే పోరాటం చేస్తుంది. ఒక జంతువు తన ఆకలిని తీర్చుకోవడానికి మరో జంతువుపై దాడి చేయక తప్పదు. ఈ క్రమంలో దాడి చేసే జంతువులు నుంచి బాధిత ప్రాణులు తప్పించుకొని వెళ్తుంటాయి. చిరుత, జింకల మధ్య రన్నింగ్ వీడియో చూస్తే ఆసక్తిని రేపుతుంది. జింక తనను తాను రక్షించుకునేందుకు పరుగులు పెడుతుంది. చిరుత దానిని ఎలాగైనా దక్కించుకోవాలని జడ్ స్పీడ్ తో వెళ్తుంది.

    అయితే ఇక్కడ సింహం, దున్నల మధ్య జరిగిన సన్నివేశం మతి పోగొడుతుంది. సింహాల గుంపు కలిసి ఓ దున్నపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. దున్న కనిపించగానే తమకు కావాల్సిన ఆహారం దొరికిందని సంతోషపడుతాయి. కానీ దున్న మాత్రం వాటికి చిక్కకుండా చెంగు చెంగున ఎగురుతుంది. సాధారణంగా దున్న రన్నింగ్ చూసి సింహాలు బయపడిపోతుంటాయి. కానీ ఈ సింహాల గుంపు నుంచి తప్పించుకోవడానికి ఎగరడం చూసి అంతా షాక్ అవుతారు.

    దున్న ఎగరడమే కాకుండా నీటిలో దూకుతుంంది. అలాగే ఈదుకుంటూ ముందుకు వెళ్తుంది. మొత్తానికి సింహాల గుంపుకు చిక్కకుండా తప్పించుకుంటుంది. దీంతో సింహాలు తమకు ఆహారం దక్కలేదని దీనంగా చూస్తాయి. దున్న మాత్రం వాటిని చూసుకుంటూ తప్పించుకొని పారిపోతుంది. దీనిని బట్టి తెలిసిందేమిటంటే అడవికి రాజైన సింహాలు సైతం ఒక్కోసారి పోరాటం ఓడిపోక తప్పదు అనిపిస్తుంది. అంతేకాకుండా తమను తాము రక్షించుకోవడానికి ఏ జంతువైనా విరోచిత ప్రయత్నాలు చేస్తుందని కనిపిస్తుంది.

    ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తాము రాజులమని విర్రవీగే వారికి ఇదొక మంచి మెసేజ్ వీడియో అని కీర్తిస్తున్నారు. కొందరు తమ గొప్పదనాన్ని ప్రదర్శించడమే కాకుండా అహంకారంతో కొనసాగుతారని, కానీ ఎదుటి వారు తమ బలం ప్రదర్శించినప్పుడు ఓడిపోకత తప్పదని అంటున్నారు. అంతేకాకుండా అన్నింటిలోనూ తమదే విజయం ఉంటుందని ఎప్పుడూ అనుకోవడానికి వీలు లేదని చెబుతున్నారు. ఈ వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేయడంతో చాలా మంది లైక్ చేస్తున్నారు.