https://oktelugu.com/

Viral Video : తాగి ఉన్నోడైనా లేచి ఎగరాల్సిందే.. అట్లుంటదీ మరీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో

ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్‌. డిసెంబర్‌ 25న పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. సంతోషంతో అందరికీ చాక్టెల్లు, కేక్‌లు పంచుతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 25, 2024 / 07:40 PM IST

    Christmas Celebrations Viral Video

    Follow us on

    Viral Video : ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలో క్రిస్మస్‌ ఒకటి. చాలా మంది ప్రజలు ఈ పండుగ జరుపుకుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వేడుకలు జరుగుతాయి. ఏటా డిసెంబర్‌ 25న క్రీస్తు జననం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు. ఏసుక్రీస్తు స్వగ్రామంలో వారు సాధారణంగా క్రిస్మస్‌ జరుపుకుంటారు. అదే విధంగా మంచు కురిసే ప్రాంతాల్లో క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ వేరేగా ఉంటాయి. ఆదా దేశాల్లో భిన్నంగా జరుపుకుంటారు. బెత్లెహమ్‌లో ఆయన పుట్టుకను ముందే తల్లి మేరీ, తండ్రి జోషెఫ్‌ గుర్తుగా 9 రోజులు వేడుక నిర్వహిస్తారు. పిల్లలు పినోటా అనే ఆట ఆడతారు. స్వీడన్‌లోని కౌల్‌ నగరంలో ఓ పెద్ద మేక విగ్రహం తయారు చేస్తారు. మేకతోపాటు జీసస్‌ జననం దృశ్యాలు ఏర్పాటు చేసి ప్రజలు సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకుంటారు. క్రిస్మస్‌ కానులకు ఇచ్చుకుంటారు. చైనాలో యాపిల్‌ సంప్రదాయంగా ఇస్తారు. యాపిల్‌ను సెల్లోఫేన్‌ కవర్‌లతో కప్పి వాటిపై శాంతి, క్రిస్మస్, ప్రేమ అనే పదాలతో లేఖను ఉంచి అందిస్తారు. జపాన్‌లో కేఎఫ్‌సీ ఆహారంతో క్రిస్మస్‌ జరుపుకుంటారు. జర్మనీలో అడ్వెంట్‌ క్యాలెండర్‌ తేదీ ప్రకారం 4 వారాల ముందు జరుపుకుంటారు.

    వీడియో వైరల్‌..
    ఇక క్రిస్మస్‌ సందర్భంగా ఇండియాలో వేడుకల గురించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూడకుండా క్రిస్మస్‌ సంపూర్ణం కాదు అనే క్యాప్షన్‌తో దీనిని పోస్టు చేశారు. రోహిత్‌ ఎక్స్‌ ఖాతాలో వీడియో పోస్టు చేశారు. ఇందులో శాంతాక్లాస్‌ వేషధారణలో ఇద్దరు డ్యాన్స్‌ చేస్తుండగా అక్కడే మద్యం తాగుతూ కూర్చున్న వ్యక్తి కూడా వారితో కలిసి స్టెప్పులే వేయడం కనిపిస్తుంది. ఓ మహిళ బయటకు వచ్చి.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు స్మైలీ ఏమోజీలు పెట్టగా.. పండుగల్లో ఇలాంటివి కామన్‌ అని కొందరు కామెంట్‌ చేశారు. అంకుల్‌ వైబ్‌ 10/10 అని మరొకరు కామెంట్‌ పెట్టారు. ఫెస్టివల్‌ వైబ్‌, సూపర్‌ అని కొందరు కామెంట్‌ చేశారు. కొందరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.