https://oktelugu.com/

Viral Video : ప్రైవేట్ పార్ట్ పై నిప్పులు.. వింతగా బర్త్ డే సెలబ్రేషన్స్: వీడియో వైరల్

బర్త్ డే భాయ్ ని సర్ ప్రైజ్ చేసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాతే ఏదో ఒక ఊహించని బహుమతిని ఇచ్చి వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా కొందరు స్నేహితులు తమ స్నేహితుడికి అరుదైన సర్ ప్రైజ్ చేశారు. అదేంటో ఈ వీడియోలో చూడండి..

Written By:
  • Srinivas
  • , Updated On : September 27, 2024 / 05:32 PM IST

    strange Birthday Celebrations

    Follow us on

    Viral Video :  పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఐకమత్యం పెరుగుతుంది. అయితే నేటి కాలంలో సాంప్రదాయ పండుగలకు బదులు వివిధ పార్టీలు జరుపుకోవడంలో ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా బర్త్ డే వేడుకల్లోయువత ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుక రోజున విషెస్ చెబుతూ కేక్ కట్ చేసి పంచుతూ ఉంటారు. కొందరు ప్రత్యేక పండుగలాగా జరుపుకుంటారు. అయితే కొందరు బర్త్ డే భాయ్ ని సర్ ప్రైజ్ చేసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాతే ఏదో ఒక ఊహించని బహుమతిని ఇచ్చి వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా కొందరు స్నేహితులు తమ స్నేహితుడికి అరుదైన సర్ ప్రైజ్ చేశారు. అదేంటో ఈ వీడియోలో చూడండి..

    అది భాయ్స్ హాస్టల్ లా ఉంది. ఓ యువకుడు నిద్రిస్తున్నాడు. ఇంతలో మరో యువకుడు అక్కడి వచ్చాడు. అతడి ప్రైవేట్ పార్ట్ ఉండే చోట ఏదో పౌడర్ చల్లాడు. ఆ తరువాత అగ్గిపుల్లను అంటించాడు. అంతే ఒక్కసారిగా మంటలు లేచాయి. అయితే ఈ మంటలను ఆ యువకుడు గుర్తించాడు. వెంటనే నిద్రలో నుంచి లేచి చూసి షాక్ అయ్యాడు. ఆ తరువాత తిరిగి పడుకొని మంటలను ఆర్పుకున్నాడు. అదృష్టవశాస్తూ అంతటితో ఆగిపోయింది. లేకుంటే అలాగే మంటలు ఉంటే ప్రమాదమే జరిగేది.

    ఆ తరువాత ఆ యువకుడు అక్కడున్న వారిని చితకబాదడానికి ప్రయత్నించాడు. కానీ అతడిని కూల్ చేయడానికి బర్త్ డే విషెస్ చెప్పారు. అంతటితో యువకుడు కూడా కూల్ అయినట్లు తెలుస్తోంది. అయితే బర్త్ డే విషెష్ చెప్పడానికి ఇంతకు తెగించారా? అని కొందరు అంటున్నారు. స్నేహితులకు బర్త్ డే వేడుకలు చెప్పడానికి కొందరు అర్ధరాత్రి రోడ్లపై కేక్ కట్ చేసి హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లోని ప్రధాన రోడ్లపై సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

    అయితే తాజాగా ఈ వీడియోలో యువకుడిపై ఏదో వేసి మంటలు పెట్టడం మరీ వికృత పోకడలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన కొందరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బర్త్ డే వేడుకలను మరి ఇలా చేసుకోవాలా? అని అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల మరింత ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పోకడలకు పోకుండా ఉండాలని సూచిస్తున్నారు.

    అయితే స్నేహితులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి బహుమతులు లేదా ఇతర మంచి పనులు చేయాలని కోరుతున్నారు. కానీ ఇలాంటి చేష్టల వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇలా చేసేవారికి దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు. అయితే కొందరు పాపులర్ కావడానికి సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి అలవాటు పడకుండా యువతను సన్మార్గంలో పెట్టాలని అంటున్నారు. ఇందుకోసం వారికి మానసికంగా కౌన్సిలింగ్ చేపట్టాలని అంటున్నారు. అలాగే మిగతా వారు చెడిపోకుండా ఉండానికి చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు కోరుతున్నారు.