Viral video : పాములలో విషపూరితమైనవి, విషపూరితం కానివి ఉంటాయి. అయితే విషపూరితం కాని వాటిలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది. ఎంత పెద్ద జంతువునైన అది అమాంతం మింగేస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా తింటుంది. ఒక్కసారి కడుపు నిండిందా.. దాదాపు 20 రోజుల వరకు అది బయట ప్రపంచానికి కనిపించదు. మత్తుగా పడుకుంటుంది. ఆ తర్వాత ఆకలి వేసినప్పుడు మళ్ళీ లేస్తుంది. ఆదమర్చి ఉన్న జంతువును మింగేస్తుంది. వాస్తవానికి కొండచిలువ నెమ్మదిగా కదులుతుంది అంటారు గాని.. భూమ్మీద అత్యంత తెలివైన జంతువుల్లో అది ఒకటి. చాకచక్యంగా ప్రత్యర్థి జంతువును మింగేయడంలో కొండచిలువను మించిన పాము లేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా దర్శనమిస్తోంది. ఆ వీడియో చూసిన వాళ్లు భయంతో వణికి పోతున్నారు. వారు అనుభవించిన భయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
ట్విట్టర్లో Nature is amazing అనే ఐడిలో ఒక వీడియో పోస్ట్ అయింది. ఆ వీడియో ప్రకారం ఇండియాలోని ఒక మారుమూల గ్రామంలో భారీ కొండచిలువను కొందరు గ్రామస్తులు తాడుతో కట్టేశారు.. అయితే ఆ కొండచిలువ ఏదో ఒక భారీ జంతువును మింగేసినట్టు కనిపిస్తోంది. అయితే అది మేకా లేదా ఇంకేదైనా జంతువా అనేది తెలియ రాలేదు. కాకపోతే ఆ కొండచిలువ మింగిన జంతువు అతి పెద్దది అని తెలుస్తోంది. అందుకే ఆ కొండచిలువ ఉదర భాగం భారీగా ఉబ్బి పోయినట్టు కనిపిస్తోంది. ఆ కొండచిలువను గ్రామస్తులు చూశారు కాబట్టి.. ఒక తాడుతో దాని మెడను కట్టేశారు. భుక్తాయాసంతో బాధపడుతున్న ఆ కొండచిలువ తన మెడకు కట్టిన తాడును విడిపించుకునేందుకు నానా తంటాలు పడింది.
ఆ తాడు తన మెడను తీవ్రంగా ఇబ్బంది పెడుతుండడంతో.. కొండచిలువ రకరకాల విన్యాసాలు చేసింది. ఈ క్రమంలో దాని భారీ శరీరం తగలడంతో ఒక ఇంటికి అడ్డుగా నిర్మించిన కంచె కూలిపోయింది. ఆ పాము పెద్దగా శబ్దాలు చేస్తూ రచ్చ రచ్చ చేయడంతో.. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భీతా వహ పరిస్థితి నెలకొంది. అయితే దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. వేలాదిమంది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ” వెనుకటి రోజుల్లో అనకొండ సినిమాను థియేటర్లో మాత్రమే చూశాము. ఇప్పుడు నిజంగా చూస్తున్నాము. ఆ పామును చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోందని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఆ పాము అలా విధ్వంసం సృష్టించిన తర్వాత. . ఆ గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. వారు ప్రత్యేకమైన బృందంతో ఆ గ్రామానికి చేరుకొని.. ఆ పాముకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఆ తర్వాత మెడకు ఉన్న తాడును విప్పి, ప్రత్యేకమైన వలల సహాయంతో స్థానికంగా ఉన్న అడవిలో వదిలినట్టు తెలుస్తోంది.
Snake found in one of the village in India pic.twitter.com/oSVjOgnWfg
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 7, 2024