https://oktelugu.com/

Viral Video : నీ క్రియేటివిటీ తగలెయ్యా.. చికెన్ పీసులను ఇలా కూడా వాడతావరా? వైరల్ వీడియో

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అయ్యే వాళ్ళు పెరిగిపోయారు. సెలబ్రిటీలుగా మారిపోవాలని వారు కూడా పెరిగిపోయారు. వారు అలా కోరుకోవడంలో తప్పులేదు. అలా అనుకోవడంలోనూ ఇబ్బంది లేదు. కానీ సెలబ్రిటీ అవ్వడానికి వారు చేస్తున్న పనులే తిక్క కలిగిస్తున్నాయి. చూసేవాళ్ళకు ఇబ్బంది కలిగిస్తాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 25, 2024 / 01:10 PM IST

    Viral video in Social media

    Follow us on

    Viral Video :  టిక్ టాక్ ఉన్నప్పుడు రీల్స్ గొడవ ఉండేది. ఆ యాప్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత.. టిక్ టాక్ అందించిన రీల్స్ సౌకర్యాన్ని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అందిపుచ్చుకున్నాయి.. ఇంకేముంది టిక్ టాక్ పెంట మొత్తం వీటిలోకి డంప్ అయింది. అయితే ఇందులో కొంతమంది చేసే వికృత చేష్టలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చూడ్డానికి కూడా ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. అయినప్పటికీ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ అలాంటివాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఉండడం విశేషం. మిగతా వారికి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని రకరకాల నిబంధన విధించే మెటా, ఇతర కంపెనీలు.. వికృత చేష్టలకు పాల్పడే వారి విషయంలో ఉదారత చూపించడం గమనార్హం.

    చికెన్ మెడలో వేసుకున్నాడు

    సాధారణంగా మనం చికెన్ ను వంటకంగా తింటాం. బిర్యానీ నుంచి మొదలుపెడితే నూడిల్స్ వరకు చికెన్ ను రకరకాల వంటకాల్లో వేసుకొని ఆరగిస్తూ ఉంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చికెన్ ముక్కల్ని తన మెడలో వేసుకున్నాడు. అంతేకాదు ఆ చికెన్ ముక్కలను చూపించుకుంటూ ఏవో గీతాలు పాడాడు. అయితే ఆ చికెన్ ముక్కలు పచ్చివి.. చూస్తుంటే కడుపులో దేవుతున్నట్టు ఉంది. అయినప్పటికీ అతడు తన పద్ధతి మార్చుకోవడం లేదు. ఏడ దొరికిన సంతరా ఇది అని నెటిజన్లు విమర్శిస్తున్నప్పటికీ అతడు తన ధోరణి తగ్గించుకోవడం లేదు. పైగా వంటిపై నూలు పోగు లేకుండా చికెన్ తోనే అతడు అలంకరించుకోవడం జుగుప్సాకరంగా మారింది. దీనిపై రకరకాల వ్యాఖ్యలు వినిపించినప్పటికీ.. చాలామంది విమర్శలు చేసినప్పటికీ అతడు ఏ మాత్రం తగ్గలేదు. పైగా మరింత రెచ్చిపోయాడు.. ” కోతుల నుంచి మనుషులు క్రమక్రమంగా నాగరీకులుగా ఎదిగారు. ఇదేం దరిద్రమో తెలియడం లేదు. కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా మారిపోతున్నారు. చూస్తుంటే ఆదిమానవులను గుర్తు చేస్తున్నారు. ఇలాంటివారిని జూలో వేయాలి. లేకుంటే క్రూర జంతువులకు ఆహారంగా వేయాలి. ఇలాంటివారిని అలానే ఉపేక్షిస్తూ ఉంటే మరింత ప్రమాదమని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

    ఇప్పుడు మాత్రమే కాదు

    చికెన్ పీసులను అలా ఒంటికి అలంకరించుకున్న వ్యక్తి సోషల్ మీడియాలో చిత్రచిత్రమైన వేషాలు వేస్తుంటాడు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. గతంలో న్యూస్ పేపర్లతో ఒక డ్రెస్ కుట్టించుకొని ధరించి సందడి చేశాడు. ఇప్పుడేమో చికెన్ పీసులను ఒంటికి అలంకరించుకొని రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్లను వదిలేయకూడదని.. మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.