https://oktelugu.com/

Viral video : హైదరాబాద్ నడిరోడ్డుపై రోమాన్స్ తో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్

నేటి కాలంలో కొందరు యువకులు, యువతులు తప్పుదారి పడుతున్నారు. సాంప్రదాయాలకు భిన్నంగా వికృత పోకడలకు పోతున్నారు. ఒకప్పుడు యువతీ యువకులు చాటుమాటుగా మాత్రమే రొమాన్స్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగా నడిరోడ్డుపై పాడు పనులు చేస్తున్నారు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : September 26, 2024 / 07:08 PM IST

    Romance On road

    Follow us on

    Viral video :  నేటి యువతే..రేపటి భవిష్యత్తు అన్నారు పెద్దలు.. ఒక దేశం, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా.. నాశనం కావాలన్నా యువత చేతుల్లోనే ఉందని కొందరు చెబుతూ ఉంటారు. అందుకే యువత మంచి మార్గంలో నడవాలని కొందరు సూచలను చేస్తుంటారు. యువతకు చదువు మాత్రమే కాకుండా మంచి నడవడిక, ప్రవర్తన కూడా చాలా అవసరం అని మేధావులు పేర్కొటుంటారు. తమతో పాటు తమ కుటుంబాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువకులపైనే ఉంటుంది. అందువల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ నేటి కాలంలో కొందరు యువకులు, యువతులు తప్పుదారి పడుతున్నారు. సాంప్రదాయాలకు భిన్నంగా వికృత పోకడలకు పోతున్నారు. ఒకప్పుడు యువతీ యువకులు చాటుమాటుగా మాత్రమే రొమాన్స్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగా నడిరోడ్డుపై పాడు పనులు చేస్తున్నారు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటంటే?

    రోడ్డుపైనే యువతీయువకులు రొమాన్స్ చేసే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకే బైక్ పై ఇద్దరు కూర్చొని అసభ్య పనులు చేస్తూ ఉండడంతో చాలా మంది తమ బండారాన్ని బయటపెట్టారు. అయితే ఇన్నాళ్లి ఇలాంటి సంఘటనలు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా చూశాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ లోనూ ఇలాంటి సంఘటనలు జరగుతూ ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డులో ఓ యువతీ యువకుడు బైక్ పై రొమాన్స్ చేస్తూ పలువురికి దొరికిపోయారు. దీంతో కొందరు వీరు చేస్తున్న వ్యవహారాన్ని వీడియో తీశారు.

    ఈ వీడియో ఆధారంగా ఓ ప్రయాణియుడు ఆన్ లైన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇలాంటివి చాలా వరకు జరుగుతున్నట్లు ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు. ముఖ్యంగా లంగ్ జర్నీ ఎక్కువగా ఉండే రోడ్డు మార్గంలో ఇలా జంటలు రెచ్చిపోతున్నారు. వీరిని చూసి ప్రయాణికులు అసహించుకుంటున్నారు. రోడ్డుపైనే ఇలా బహిరంగంగా రొమాన్స్ చేయడం ద్వారా ఒక్కోసారి వారు ఇతరుల ప్రయాణాలకు భంగం కలిగిస్తున్నారు. అయితే వారు మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా వారి పని వారు కానిచ్చేస్తున్నారు.

    గతంలో ఇలాంటి సంఘటనలపై పోలీసులు స్పందించారు. రోడ్డుపై అసభ్యంగా రొమాన్స్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. వారి చర్యలు మాత్రం మానుకోవడం లేదు. అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల మిగతా యువత చెడిపోతుందని, దీంతో సభ్య సమాజంలో చీడ పురుగుల్లా తయారవుతున్నారని ఆరోపిస్తున్నారు.

    రోడ్డుపై ఇలా రొమాన్స్ చేసేవారు మాత్రమే కాకుండా రీల్స్ చేసేవారితో ఇబ్బందులు కలుగుతున్నాయని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొందరు రీల్స్ చేయడం కోసం బైక్ పై ఫీట్లు చేస్తున్నారని, దీంతో ప్రయాణం చేయడం కష్టతరంగా మారుతుందని అంటున్నారు. ఇటువంటి వారిపైన పోలీసులు దృష్టి పెట్టకపోతే బైక్ పై రొమాన్స్ చేసే సంఘటనలతో పాటు రీల్స్ తీసేవారి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని కోరుతున్నారు.