Viral Video : పుష్ప-2(Pushpa-2) సినిమాలో పోరాట ఘట్టాలు ఆకట్టుకున్నాయి. డైలాగులు, పాటలు అలరించాయి. ఈ సినిమాలో పీలింగ్స్ (peelings) అనే పాటకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. వీజే శేఖర్ మాస్టర్(vj shekar master) కంపోజ్ చేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ పాట సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్, సామాన్యులు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధురాలు పీలింగ్స్ పాటకు అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసింది. ఓ యువకుడిని తన స్టెప్పులతో మైమరపింపజేస్తూ ఆకట్టుకున్నది. ఆ యువకుడిని ఉక్కిరిబికిరి చేసింది.
నెట్టింట హల్ చల్
ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఆ వృద్ధురాలు హావభావాలతో ఆకట్టుకున్నది. కొన్ని స్టెప్పుల్లో అయితే రష్మిక అను మించిపోయింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” బామ్మ గారు స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఈ వయసులోనూ అదరగొడుతున్నారు. ఇక ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు ఏ స్థాయిలో డ్యాన్స్ చేసి ఉంటారో.. పీలింగ్స్ పాటలో ఆమె ఫీలింగ్స్ బాగున్నాయి. అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసిన ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమ అవకాశాలు ఇస్తుందేమో చూడాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.. ఇక ఈ సినిమాను సుకుమార్ (Sukumar) తెరకెక్కించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పహాడ్ ఫాజల్ ప్రతినాయక పాత్రలో నటించారు. జగపతిబాబు, అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. కిస్సిక్ అనే ప్రత్యేక గీతం లో శ్రీ లీల(Shri Leela) కనిపించింది. ఆ పాట కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. మరోవైపు పుష్ప-2 సినిమాకు సంబంధించి రీ లోడెడ్ వర్షన్ కూడా విడుదల కానుంది. ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు అదనపు సన్నివేశాలు జోడిస్తారట. అంటే పుష్ప -2 ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు ఇందులో ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు దంగల్ సినిమా సృష్టించిన రికార్డులు భారతీయ చిత్ర పరిశ్రమలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. పుష్ప సినిమా ఇదే స్థాయిలో వసూళ్లు సాధిస్తే కచ్చితంగా దంగల్ సినిమాను కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ నిపుణులు పేర్కొంటున్నారు.
.@alluarjun ఎంత పని చేసావు తమ్ముడూ pic.twitter.com/QY6WbZWmhu
— MegaFamilyFanForEver (@JSPROYALSOLDIER) January 7, 2025