Viral: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఈ క్రమంలో రోజూ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే చెప్పక్కర్లేదు. సరదాగా ఇంట్లో జరిగిన ప్రతీ విషయాన్ని రికార్డు చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అప్‌లోడ్ చేస్తుంటే కొన్ని నిమిషాల వ్యవథిలోనే వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్నో వీడియోలు రోజూ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు అయితే కొన్నింటిని కావాలనే వైరల్ చేయడానికి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. మరికొందరు వారి సరదా కోసం పోస్ట్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రకరకాల వంటలు, స్పెషల్, ఏదైనా కొత్తగా ఉన్నవి అన్ని కూడా తెలుస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన కూడా క్షణాల్లో ఈ సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతున్నాయి. అయితే రకరకాల వంటలు సోషల్ మీడియాలో డైలీ ట్రెండ్ అవుతుంటాయి. కొందరు టైమ్ పాస్ లేదా వైరల్ కోసం చాక్లెట్ మ్యాగీ, చాక్లెట్ రైస్, చాక్లెట్ పిజ్జా ఇలా రకరకాల వంటలు చేస్తుంటారు. అయితే ఇటీవల ఫ్రాగ్ పిజ్జా అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాకి చెందిన పిజ్జా హట్ ఫ్రాగ్ పిజ్జాను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిజ్జా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గోబ్లిన్ పిజ్జా అనే పేరుతో చైనాకి చెందిన పిజ్జా హట్ ఈ ఫ్రాగ్ పిజ్జాను తయారు చేసింది. చూడటానికి ఎంతో కలర్‌ఫుల్‌గా ఈ పిజ్జాను తయారు చేసింది. సాధారణ పిజ్జాలనే తయారు చేసి దానిపైన కప్పను పెట్టింది. దీనికి మళ్లీ కొత్తిమీరతో గార్నిష్ చేశారు. ఫ్రాగ్ పిజ్జా అనే మాట కానీ.. చూడటానికి చాలా అందంగా ఉంది. చూస్తే నోరూ ఊరిపోతుంటుంది. అయితే ఫ్రాగ్ పిజ్జా ధర కేవలం 169 యువాన్లు. అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం రూ.2000 మాత్రమే. ఎంతో స్పెషల్‌గా తయారు చేసిన ఈ ఫ్రాగ్ పిజ్జాను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే కప్పతో పిజ్జా ఏంటి? దీన్ని చూస్తేనే ఫుడ్ మీద విరక్తి వస్తుంది. అలాంటిది ఎలా తింటారో అని నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు చైనా వాళ్లు ఇలాంటి ఫుడ్స్‌ను ఎలా తింటారని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా అయిన కూడా చైనా వాళ్లు కీటకాలు, బొద్దింకలు ఆఖరికి పాములు కూడా తింటారు. మనకి వీటిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. కానీ వారు మాత్రం ఎలాంటి సందేహాలు లేకుండా వీటికి మంచిగా తింటారు. వీటిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో రావో తెలియదు. కానీ ఇలాంటి కీటకాలు ఉన్న ఆహారాలకు మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ కప్పతో పిజ్జా ఏంటని షాక్ అవుతున్నారు.
In case yesterday’s post about Pizza Hut, making tomato wine wasn’t enough, how about their current promotion in China, a pizza topped with whole frog? Would you give this a try? Would you rather see pineapple? pic.twitter.com/vS2M9p1eH2
— James Walker (@jwalkermobile) November 21, 2024
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Viral mouth watering frog pizza do you know where to find it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com