Karnataka : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు ముందు అసలు ఈ రాష్ట్ర పుట్టుపూర్వత్రాలు తెలుసుకుందాం. ఇవాళ కర్ణాటక స్వరూపం వేరు. 1947 స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి 6 పాలన ప్రాంతాల్లో కర్ణాటక ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బ్రిటీష్ సంస్థానం.. హైదరాబాద్ సంస్థానం.. మరాఠా సంస్థానం, మైసూర్ సంస్థానాల్లో ఉండేవి.
మైసూర్ సంస్థానం భారత్ లో విలీనం అయ్యాక దీన్ని రాష్ట్రంగా ప్రకటించారు. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. మైసూర్ రాష్ట్రం కర్ణాటకలో కలవాలని కోరుకోలేదు. ఎందుకంటే మిగతా కర్ణాటక ఉత్తర కర్ణాటక చాలా వెనుకబడిన ప్రాంతాలు సో.. తాము విడిగా రాష్ట్రంగా ఉంటామని మైసూర్ ప్రజలు కోరుకున్నారు. కానీ పాలకులు మాత్రం కర్ణాటకలోనే విలీనం చేశారు.
కర్నాటకలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఇప్పుడు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. అక్కడ జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. ఎప్పుడు కింగ్ మేకర్ గా ఉండే జేడీఎస్ సైతం గట్టిగానే పోరాడుతోంది.
మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్న కర్నాటకలో దాదాపు 100 నియోజకవర్గాల్లో లింగాయత్ ల ప్రభావం అధికం. రాష్ట్ర జనాభాలో వీరు 17 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పక్షాలు లింగాయత్ లకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. ఇప్పటివరకూ కర్నాటక రాష్ట్రానికి 23 మంది సీఎంలు పనిచేశారు. అందులో పది మంది లింగాయత్ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. 1989 వరకూ లింగాయత్ లు కాంగ్రెస్ వైపే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లింగాయత్ లను తప్పించి బీసీ వర్గానికి ముఖ్యమంత్రి పదవి కేటాయించడంతో బీజేపీ వ్యూహాత్మకంగా యాడ్యూరప్పకు ప్రోత్సాహం అందించింది. దీంతో అప్పటి నుంచి బీజేపీ వైపు లింగాయత్ లు టర్న్ అయ్యారు. ఆ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారిపోయారు. అయితే మిగిలిన సామాజికవర్గాలకు సంబంధించి వక్కలిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18 శాతం, ముస్లింలు 12.9 శాతం, బ్రాహ్మణులు 3 శాతంగా ఉన్నారు. అయితే లింగాయత్ లు 9 శాతం, వక్కలిగలు 8 శాతం మాత్రమే ఉన్నట్టు మిగతా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికల కంటే ముందు దాని పుట్టు పూర్వోత్తరాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.