https://oktelugu.com/

Indians Caste Discrimination in USA: అమెరికా వెళ్లినా మన బుద్దులు మారవా?

మన వాళ్లు అమెరికా వెళ్లినా అక్కడ వీరి బుద్దులు మారవని తేలిపోయింది. అమెరికాలో కూడా కులాల కుంపట్లు రాజేస్తున్నారు. అమెరికా ప్రసిద్ధ కాడ్మె ఎండోమెంట్ సంస్థ ఒక సర్వే చేసింది. అమెరికాలోని ఇండియన్ అమెరికన్లు మన వాళ్లతోనే మాట్లాడుతారట.. అదే టైంలో కుల గుర్తింపును పోగొట్టుకోవడం లేదు. అమెరికా వెళ్లినా ఈ భారతీయ సమాజంలో ఈ కులజాఢ్యం అక్కడ కూడా విస్తరిస్తుండడం మన దౌర్భాగ్యంగా చెప్పొచ్చు. తానా, ఆప్టా, ఆటా, నాటా లాంటి తెలుగు సంఘాలు కులాలను […]

Written By: NARESH, Updated On : February 16, 2022 6:18 pm
Follow us on

మన వాళ్లు అమెరికా వెళ్లినా అక్కడ వీరి బుద్దులు మారవని తేలిపోయింది. అమెరికాలో కూడా కులాల కుంపట్లు రాజేస్తున్నారు. అమెరికా ప్రసిద్ధ కాడ్మె ఎండోమెంట్ సంస్థ ఒక సర్వే చేసింది. అమెరికాలోని ఇండియన్ అమెరికన్లు మన వాళ్లతోనే మాట్లాడుతారట.. అదే టైంలో కుల గుర్తింపును పోగొట్టుకోవడం లేదు. అమెరికా వెళ్లినా ఈ భారతీయ సమాజంలో ఈ కులజాఢ్యం అక్కడ కూడా విస్తరిస్తుండడం మన దౌర్భాగ్యంగా చెప్పొచ్చు.

తానా, ఆప్టా, ఆటా, నాటా లాంటి తెలుగు సంఘాలు కులాలను బట్టి.. కులాల ఆధిపత్యంలో మగ్గుతున్న కుల సంఘాలుగా అక్కడి వారే అభివర్ణిస్తున్నారు. అమెరికా సమాజం కూడా భిన్నమైనది కాదు.. అక్కడ నల్లజాతీయులపై తెల్లవారు వివక్ష చూపించడం ఇప్పటిది కాదు..

జూన్ 2020లో అమెరికన్ పోలీస్ జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని చంపడం అమెరికాలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఇటీవల క్రిటికల్ రేస్ థియరీ అనేది ప్రసిద్ధి చెందింది. అమెరికాలో జాతివివక్షపై కొత్తగా పాఠాలు చెబుతున్నారు.

కొత్తగా ఇండియన్ అమెరికన్లలో కులాన్ని కూడా వివక్ష సమాజం కిందకు చేర్చి వారి విశ్వవిద్యాలయాలు, టెక్ కంపెనీల్లో ‘కులం’ అనే కాలమ్ యాడ్ చేశారు. గత ఐదేళ్ల నుంచి దీనికి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు ఉద్యమిస్తున్నాయి. సిస్కో కంపెనీలో ఒక దళితుడిపై వివక్ష జరిగితే విచారణ చేస్తే నిజమని తేలింది. అమెరికాలో మరో కంపెనీల్లో కూడా ఇదే నిరూపితమైంది. వర్క్ ప్లేసుల్లో కూడా అదే నిజమైంది. అమెరికాలో కూడా కులాల జాఢ్యాలను విడవకుండా ఇండో అమెరికన్లు ఉండడం దారుణమనే చెప్పొచ్చు. అమెరికాలో మనోళ్ల కులాల కుంపట్లపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

అమెరికాలో కూడా మనవాళ్ళ కులాల కుంపట్లు | Indians Caste Discrimination in USA | RAM Talk