Homeఅంతర్జాతీయంIndian Migrant Issues: ఛీ.. ఏం బతుకులు రా బై.. ఇంకా ఎందుకు అమెరికా ను...

Indian Migrant Issues: ఛీ.. ఏం బతుకులు రా బై.. ఇంకా ఎందుకు అమెరికా ను పట్టుకొని వేలాడుడూ!(వీడియో)

Indian Migrant Issues: అమెరికాలో భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. పేరుపొందిన కంపెనీలకు భారతీయులు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అన్ని కంపెనీలలో భారతీయులు కీలక స్థానాలలో కొనసాగుతున్నారు. పేరుపొందిన దిగ్గజ సంస్థలకు భారత మూలాలు ఉన్న వ్యక్తులు సారథ్యం వహించడం గొప్ప విషయం. భారతీయులకు కూడా గర్వకారణం. కానీ ఇదే విషయంలో అమెరికన్ల వ్యవహార శైలి మరో విధంగా ఉంది. వారు భారతీయులు అంటేనే మండిపడుతున్నారు. వారి అవకాశాలు మొత్తం భారతీయులు లాగేసుకుంటున్నారని.. ఉద్యోగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ భారతీయుడు పై ఓ అమెరికా వ్యక్తి మండిపడిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో శ్వేత దేశంలో భారతీయులకు ఏ స్థాయిలో అవమానాలు ఎదురవుతున్నాయో మరోసారి కళ్ళకు కట్టింది.

Also Read: ప్రళయం’ జోస్యం.. ఊపిరి పీల్చుకున్న జపాన్‌

వాస్తవానికి మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేది కేవలం ఉన్నత ఉద్యోగాలు.. ఉన్నత చదువుల కోసం మాత్రమే. అమెరికాలో డాలర్ మారకంలో చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. డాలర్ అనేది ప్రపంచ ప్రామాణికమైన కరెన్సీ. ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటయే కరెన్సీ కూడా డాలర్ మాత్రమే. అందువల్లే మన దేశంలోని యువత మొత్తం చదువు, ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్తోంది. ప్రస్తుతం అమెరికాలో సింహభాగం భారతీయులే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల ప్రచారంలో అప్పటి శ్వేత దేశ అధిపతి ప్రపంచ దేశాల అధినేతలను కాకుండా నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే అక్కడ మన వాళ్ళ ప్రాధాన్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొంతకాలంగా అమెరికాలో అన్ని సంస్థల్లో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇది భారతీయులకు ఆనందంగానే ఉన్నప్పటికీ.. అమెరికా దేశస్థులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అమెరికా దేశస్తులు తమ అవకాశాలను మొత్తం భారతీయులు లాగేసుకుంటున్నారని మండిపడుతున్నారు. కొన్ని సందర్భాలలో దాడులు కూడా చేస్తున్నారు. కాల్పులకు కూడా తెగ పడుతున్నారు. అయితే అమెరికాలో ఆయుధ చట్టాలు విచిత్రంగా ఉంటాయి. అందువల్లే అక్కడ వ్యక్తిగత ఆయుధాలు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పైగా అమెరికా దేశస్థులలో విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది. కష్టపడి పనిచేయడాన్ని వారు పెద్దగా ఇష్టపడరు. పైగా అక్కడ నిబంధనలను వారు తమకు అనుకూలంగా మలుచుకుంటారు. భారతీయులు మాత్రం కష్టపడి పని చేస్తుంటారు. అందువల్లే వారికి ఆ స్థాయిలో అవకాశాలు లభిస్తుంటాయి. భారతీయులు కష్టపడి పనిచేసే విధానాన్ని అమెరికా ప్రజలు జీర్ణించుకోలేరు. అందువల్లే దాడులకు పాల్పడుతుంటారు.

Also Read: 6,852 దీవుల దేశం.. జపాన్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు

ఇక తాజాగా భారతీయుడిని దూషిస్తూ అమెరికా వ్యక్తి వ్యవహరించిన తీరు సర్వత్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఇదే నేపథ్యంలో ఇండియన్స్ నుంచి సోషల్ మీడియాలో అమెరికా దేశస్థులపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతున్నది. “అమెరికా వాడు తిడుతుంటే పడాలా? అసలు అక్కడికి ఎందుకు వెళ్లాలి? డాలర్ల కోసమేనా? ఇంత బతుకు బతికి అక్కడిదాకా వెళ్లడం ఎందుకు? మనదేశంలో ఉపాధి లేదా? ఇక్కడ ప్రజలు బతకడం లేదా? కేవలం డబ్బుల కోసం అయితే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. బతికి ఉంటే గంజైన తాగి బతకచ్చు. అంత తప్ప డాలర్ల కోసం ఇలా మాటలు పడాల్సిన అవసరం లేదు. భారతీయులు ఈ స్థాయిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular