https://oktelugu.com/

G20 meeting in Srinagar : శ్రీనగర్ G-20 సమావేశం అత్యంత కీలక పరిణామం

G20 meeting in Srinagar : జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందరకాశ్మీరాన్ని ప్రపంచ అధినేతలకు చూపించేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పైగా డ్రాగన్ చేస్తున్న అక్రమాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఆయన కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని సమాచారం. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తులు, […]

Written By: , Updated On : April 11, 2023 / 09:27 PM IST
Follow us on

శ్రీనగర్ G-20 సమావేశం అత్యంత కీలక పరిణామం || G20 meeting in Srinagar || Ram Talk

G20 meeting in Srinagar : జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందరకాశ్మీరాన్ని ప్రపంచ అధినేతలకు చూపించేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పైగా డ్రాగన్ చేస్తున్న అక్రమాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఆయన కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని సమాచారం. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్ము కాశ్మీర్ ఆతిథ్యం ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. భారతదేశంలో తొలిసారిగా 2023లో జి20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశాలను నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ నుంచి ఇద్దరు నోడల్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం గమనార్హం.

జీ20 సమావేశాలు రొటీన్ గా జరిగేవే కదా దానికి భారత్ దీనికి ఇంత ప్రచార ఆర్భాటం ఎందుకని కొందరు విమర్శించారు. దానికి సమాధానం దొరికింది. మే 24న శ్రీనగర్ లో జరిగే జీ20 సమావేశాలు ఓ గొప్ప సమాధానం అని చెప్పొచ్చు..

కశ్మీర్ లో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు చేశాక కశ్మీర్ లో జరుగుతున్న మొట్టమొదటి సమావేశం ఇదీ.. 2019 ముందు వరకూ అంతర్జాతీయ సమావేశాలు కశ్మీర్ లో జరిగిన చరిత్ర లేదు. ప్రపంచంలోనే టాప్ 20 దేశాల శిఖరాగ్ర సమావేశం కశ్మీర్ లో జరగబోతుండడం వెనుక చాలా తేడా ఉంది.

కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనేది అంతర్జాతీయ ప్రపంచానికి చాటిచెప్పడానికే జీ20 సమావేశాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్, చైనా కశ్మీర్ పై ఎంత పనిగట్టుకొని దుష్ప్రచారం చేసినా కూడా ఇప్పుడు భారత దేశం కశ్మీర్ లో ఈ సమావేశం నిర్వహించి ఆ రెండు దేశాల నోళ్లు మూయిస్తోంది. అంతర్జాతీయ సమాజం.. ఈ సమావేశంతో కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని అంగీకరించినట్టు అవుతుంది. అందుకే ఈ సమావేశాన్ని భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కశ్మీర్ లో నిర్వహిస్తూ చైనా, పాకిస్తాన్ లకు గట్టి షాకులు ఇస్తోంది.

శ్రీనగర్ G-20 సమావేశం భారత్ కు ఎంత కీలకం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.