CPI – National Party Status : సీపీఐ దేశంలో ఎందుకు కనుమరుగైంది? జాతీయ హోదా ఎలా కోల్పోయింది?

CPI – national party status : నిన్నటి వరకు జాతీయ పార్టీలుగా ఉన్న ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) తాజాగా జాతీయ గుర్తింపు కోల్పోయాయి. కొన్నేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీలకు నిబంధనల మేరకు ఓట్ల శాతం రావడం లేదు. సీట్లు కూడా గెలవడం లేదు. దీంతో తాజా సమీక్షలో ఆ పార్టీల జాతీయ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇదే సమయంలో […]

Written By: NARESH, Updated On : April 11, 2023 10:20 pm
Follow us on

CPI – national party status : నిన్నటి వరకు జాతీయ పార్టీలుగా ఉన్న ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) తాజాగా జాతీయ గుర్తింపు కోల్పోయాయి. కొన్నేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీలకు నిబంధనల మేరకు ఓట్ల శాతం రావడం లేదు. సీట్లు కూడా గెలవడం లేదు. దీంతో తాజా సమీక్షలో ఆ పార్టీల జాతీయ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది.

ఇదే సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ప్రకటించింది. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడంతోపాటు, గుజరాత్‌లో 6 శాతానికిపైగా ఓట్లు సాధించడం, గోవాలో సీట్లు గెలుచుకోవడంతో ఆప్‌కు జాతీయ హోదా దక్కింది.

ఇక దేశవ్యాప్తంగా కొన్ని పార్టీలు ప్రాంతీయ హోదా కూడా కోల్పోయాయి. రెండు పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. తెలుగు రాష్ట్రాల్లో తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ, బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీలే అని ఈసీ స్పష్టం చేసింది. వైఎస్సార్‌ సీపీ కూడా ప్రాంతీయ పార్టీనే అని పేర్కొంది. వీటికి జాతీయ గుర్తింపు లేదు. జాతీయ కార్యదర్శి, జాతీయ అధ్యక్షుడు అనేది కేవలం పత్రికల్లో రాసుకోవడానికి మాత్రమే. ఆవిషయం మరోమారు ఈసీ స్పష్టం చేసింది.

ప్రతీ ఎన్నికలకు ముందు ఈసీ జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాను ప్రకటించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే తాజా ప్రకటనను ఈసీ విడుదల చేసింది.

జాతీయ హోదా కోల్పోయిన భారత్ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర.. లోపాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..