https://oktelugu.com/

Greatness Of Teacher: టీచర్ల గొప్పతనానికి నిదర్శనం ఇదీ!

Greatness Of Teacher: అనుకోకుండా ఓ ముసలాయన్ని ఓ యువకుడు పలకరించి కాళ్లు మొక్కాడు… ‘సర్, నన్ను గుర్తుపట్టారా..?‘ ఆయన గుర్తుపట్టలేదు అన్నాడు… ‘సర్, నేను మీ స్టూడెంట్‌ను…’ ‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తులేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?’ ‘నేను టీచర్ అయ్యాను మాస్టారూ…’ ‘గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?’ ‘అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి’ ‘అదేంటి..?’ ‘బహుశా మీకు గుర్తుండదు, నేను చెబుతా వినండి…’ —— […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2021 / 11:26 AM IST
    Follow us on

     

    Greatness Of Teacher: అనుకోకుండా ఓ ముసలాయన్ని ఓ యువకుడు పలకరించి కాళ్లు మొక్కాడు…
    ‘సర్, నన్ను గుర్తుపట్టారా..?‘
    ఆయన గుర్తుపట్టలేదు అన్నాడు… ‘సర్, నేను మీ స్టూడెంట్‌ను…’
    ‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తులేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?’
    ‘నేను టీచర్ అయ్యాను మాస్టారూ…’
    ‘గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?’
    ‘అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి’
    ‘అదేంటి..?’
    ‘బహుశా మీకు గుర్తుండదు, నేను చెబుతా వినండి…’
    ——
    ‘‘ఓసారి నా దోస్త్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు… దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి దొంగతనం చేశాను… కాసేపటికి వాడికి వాచీ పోయిందని తెలిసొచ్చింది… లబోదిబో ఏడ్చాడు… టీచర్‌కు కంప్లయింట్ చేశాడు… అప్పుడు ఆ టీచర్ మీరే…
    ఒరేయ్ పిల్లలూ, ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు… నేనేమీ భయపడలేదు, తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా…
    మీరు కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్‌గా నిలబెట్టారు… ప్రతి ఒక్కరి జేబూ చెక్ చేస్తానన్నారు… కాకపోతే అందరినీ కళ్లుమూసుకోవాలని చెప్పారు… జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా అన్నారు…
    తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు… నాకు అర్థం కాలేదు…
    వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు అన్ని జేబుల తనిఖీ అయిపోయాక…
    ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించలేదు, నలుగురిలో నా డిగ్నిటీని మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది… ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో…
    నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్… కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా… నాఅంతట నేనే మారిపోయేలా చేశారు… ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..? ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్…’’
    .
    .
    .
    .
    అప్పుడు ఆ టీచర్ చెప్పాడు… ‘‘ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను… నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు కారణం కావొచ్చు… అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ల దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం…. నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను…’’
    .
    .
    .
    .
    -MSR (ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు ఎప్పటిలాగే నా స్వేచ్చానువాదం…)