Homeఆంధ్రప్రదేశ్‌MP Raghu Rama Krishna Raju: వైసీపీ రెబల్ ఎంపీకి ఈ సంక్రాంతి పూట ఎంతటి...

MP Raghu Rama Krishna Raju: వైసీపీ రెబల్ ఎంపీకి ఈ సంక్రాంతి పూట ఎంతటి గతిపట్టే

MP Raghu Rama Krishna Raju: సంక్రాంతి పండుగ అంద‌రికీ తీపి జ్ఞాప‌క‌మైతే.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజుకు మాత్రం చేదు జ్ఞాప‌కంగా మిగిలిపోయింది. భీమ‌వ‌రంలో సంక్రాంతి అంతా ర‌ఘురామ‌దే అన్న‌ట్టు ఉండేది. ఈసారి మాత్రం ఆ అవ‌కాశం లేకుండా పోయింది. మ‌నిషి లేక‌పోతేనేం.. మ‌న క‌టౌట్ ఉంటే చాలు అనుకున్నారేమో. పండుగ పూట భీమ‌వ‌రం కోడి పందేల నిర్వ‌హ‌ణ ప్రాంతంలో ఆయ‌న క‌టౌట్ ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో రాజుగారి క‌టౌట్ పై ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఒక‌టే చ‌ర్చ అట‌.

MP Raghu Rama Krishna Raju
MP Raghu Rama Krishna Raju

2019 ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌కృష్ణ రాజు.. ఆ తర్వాత సీఎం జ‌గ‌న్ తో విభేధించారు. సీఎం జ‌గ‌న్ కు కంట్లో న‌లుసులా త‌యార‌య్యారు. ప్ర‌తిరోజు వైసీపీని, సీఎంను తిట్ట‌డ‌మే ప‌ని అన్న‌ట్టుగా ప్రెస్ మీట్లు, ట్వీట్ల‌తో వైసీపీని బేజారెత్తించారు. దీంతో ర‌ఘురామ పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఏపీ సీఐడీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును అదుపులోకి తీసుకుంది. ఆ స‌మ‌యంలో త‌న పై దాడి చేసిన‌ట్టు ర‌ఘురామ ఆరోపించారు. దీని పై లోక్ స‌భ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు.

అప్ప‌టి నుంచి ఏపీ వైపు అడుగు పెట్ట‌కుండా, సొంత నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌కుండా చేసింది ఏపీ ప్ర‌భుత్వం. ర‌ఘ‌రామ వ‌స్తే లోప‌లేసెయ్యాల‌న్న‌ట్టు ఆయ‌న పై కేసులు న‌మోద‌య్యాయి. దీంతో తెలంగాణ‌, ఢిల్లీ మ‌ధ్యే ర‌ఘురామ తిరుగుతున్నారు. ర‌ఘురామ పై ఇంత చ‌ర్చ జ‌ర‌గ‌డానికి కార‌ణం భీమ‌వ‌రంలో ప్ర‌త్య‌క్ష‌మైన ఆయ‌న క‌టౌట్. గ‌తంలో సంక్రాంతి సంద‌ర్భంగా కోడి పందేల బ‌రుల్లో తెగ సంద‌డి చేసేవారు ర‌ఘురామ‌. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం ఏపీ వైపు వచ్చే అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో ఆయ‌న క‌టౌట్ ను కోడి పందేల బ‌రుల స‌మీపంలో ఏర్పాటు చేయించారు.

MP Raghu Rama Krishna Raju
MP Raghu Rama Krishna Raju

ర‌ఘురామ క‌టౌట్ తో జ‌నంలో ఒక‌టే చ‌ర్చ మొద‌లైంది. మ‌నిషి లేక‌పోయినా.. క‌టౌట్ తో సంబ‌రప‌డిపోతున్నాడ‌ని కొంద‌రు అంటుంటే.. ప్ర‌భుత్వంతో పేచీ పెట్టుకోకుండా ఉంటే సంక్రాంతికి ఊరికి వ‌చ్చేవారు క‌దా అని మ‌రికొంద‌రు అనుకుంటున్నార‌ట‌. ఏది ఏమైనా ర‌ఘురామ మాత్రం ఏపీ ప్ర‌భుత్వం పై వెన‌క్కి త‌గ్గేలా లేడు. అవ‌కాశం దొరికితే ప్ర‌భుత్వం పై విరుచుకుప‌డుతున్నారు. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతున్నారు. దీంతో ఆయ‌న వైఖ‌రి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డ‌టంలేదు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version