
Youtuber MrBeast: హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనం సాధారణంగా వెయిటర్ లేదా వెయిట్రస్‌కు భోజనం చేసిన తర్వాత పదో ఇరవయో టిప్‌గా ఇస్తాం. సర్వీస్ బాగుంటే రూ.50 లేదా రూ.100 ఇస్తారు. ఇక స్టార్ హోటల్ అయితే అక్కడికి వెళ్లే సంపన్నులు రూ.500 నుంచి రూ.1000 టిప్పుగా ఇస్తారు. కానీ ఇక్కడో కస్టమర్.. వెయిట్రస్ మైండ్ బ్లాక్ అయ్యేలా టిప్ ఇచ్చాడు.
మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ..
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మీస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్‌సన్ ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లును సంపాదించుకున్నాడు. వెరైటీ కంటెంట్‌లతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుంటాడు. అందుకే తన ఫాలోవర్లు సంఖ్య 139 మిలియన్లకు పెంచుకోగలిగాడు. తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్తగా ప్లాన్లు చేసే ఈ యూట్యూబర్ ఇటీవల ఓ వెయిట్రస్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఊహికందని టిప్..
రెస్టారెంట్‌కు వెళ్లిన యూట్యూబర్ జిమ్మీ.. అక్కడ పని చేస్తున్న వెయిట్రెస్‌తో ముచ్చటించాడు. ‘ఇంత వరకు నువ్వు అత్యధికంగా ఎంత టిప్ తీసుకున్నావు’ అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆమె 50 డాలర్లు అని సమాధానమిచ్చింది. దాంతో ఇప్పటివరకూ నీకు టిప్‌గా ఎవరైనా కారు ఇచ్చారా అని అడిగాడు. ఎవరూ ఇవ్వలేదని వెయిట్రస్ చెప్పగానే తన కారు తాళాన్ని తీసి ఆమెకు ఇచ్చేశాడు. కానీ, ఈ విషయాన్ని ఆమె నమ్మలేదు. దీంతో ఆ యూట్యూబర్ తను కారును పార్క్ చేసిన ప్రదేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు.

కోట్ల ఖరీదు..
ఆ వెయిట్రస్‌కు జిమ్మీ టిప్‌గా ఇచ్చిన కారు.. బ్లాక్ టయోటా. ఆ కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. కస్టమర్ నుంచి కోట్లు ఖరీదైన కారుని టిప్‌గా అందుకోవడంతో వెయిట్రెస్ ఆనందంలో మునిగి పోయింది. వెయిట్రస్ ఆనంద పడే వీడియోనూ జిమ్మీ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్ ఔదార్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు.