YouTube- Shorts Creators: ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దీంతో ఇటీవల యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో తమ సంపాదన పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆదాయం దక్కనుంది. యూ ట్యూబ్ నిర్ణయంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రతి వారు యూట్యూబ్ వేదికగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితంగా వారి సంపాదన కూడా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.

యూట్యూబ్ షార్ట్స్ రూపంలో కంటెంట్ క్రియేట్ చేస్తున్న వారికి ఇకపై ఆదాయం భారీగా రానుంది. గూగుల్ న్యూస్ వెల్లడించిన ప్రకారం కంటెంట్ క్రియేటర్లకు పండగ కానుంది. యూట్యూబ్ పలు కంపెనీలకు దీటుగా తమ కంటెంట్ క్రియేటర్లకు వేతనం పెంచబోతోంది. కంపెనీ నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనాలు కలగనున్నాయి. కాకపోతే 2023 నుంచి ఈ ఫలితాలు అమలు చేసేందుకు నిర్ణయించింది. దీంతో అప్పటిదాకా ఆగాల్సిందే. దీనికి ఓ షరతు విధించింది. గత 90 రోజుల కాలంలో వెయ్యి మంది సబ్ స్ర్కైబర్లను కలిగి ఉండి వారి వీడియోలకు 10 మిలియన్ వ్యూవ్స్ కలిగి ఉండాలనే నిబంధన విధించింది. దీనికంటే ముందు వెయ్యికి పైగా సబ్ స్క్రైబర్లతో పాటు 4 వేల గంటల వ్యూవ్స్ ఉండాలని తెలిపింది.
Also Read: Krishnam Raju Daughter: కూతురు చేసిన పనికి రూ.100 కోట్లు పోగొట్టుకున్న కృష్ణంరాజు
ఇన్నాళ్లు ఎక్కువ నిడివి గల వీడియోలు ఉండటంతో సమయం వృథా అయ్యేది. ప్రస్తుతం వాటి పరిధి తగ్గించడంతో సమయం ఆదా అవుతుంది. మారుతున్న డిజిటల్ ల్యాండ్ స్కేప్ లో భాగంగా యూట్యూబ్ ప్లాట్ ఫామ్ నిలుపుకునేందుకు సిద్ధపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూట్యూబ్ తీసుకున్ని నిర్ణయంతో కంటెంట్ క్రియేటర్లకు మంచి లాభాలు దక్కనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 50 బిలియన్ డాలర్లకు ైగా పెయిడ్ క్రియేటర్లు, ఆర్టిస్టులు, మీడియా కంపెనీలు యూట్యూబ్ కోసం పని చేస్తున్నాయి.

మారిన పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఒక నిమిషం లోపు వీడియోలకు కూడా రెవెన్యూ షేరింగ్ విధానంతో మేలు జరగనుంది. షార్ట్ వీడియోల విషయంలో యాడ్ రెవెన్యూ షేరింగ్ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. టిక్ టాక్ సైతం ఇదే ఫాలో కావడం గమనార్హం. దీంతో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల ఆదాయం పెరిగి వారికి మంచి లాభాలు చేకూరనున్నాయి. యూ ట్యూబ్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. డబ్బుల వర్షం కురిస్తే వారిలో జోష్ పెరిగి ఇంకా ఎక్కువ పని చేసేందుకు మొగ్గు చూపుతారని తెలుస్తోంది.
Also Read: Minister Roja vs Janasena: నగరిలో హైటెన్షన్.. మంత్రి రోజాకు జనసేన నేతల సవాల్