Vijay Deverakonda: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్..పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలబడలేదు..విజయ్ దేవరకొండ పాపం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు..మూడేళ్ళ విలువైన సమయం ని వెచ్చించాడు..మొత్తం బూడిదలో పోసిన పనీర్ లాగ అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా లావాదేవీలపై ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన పూరి జగన్నాథ్ మరియు ఛార్మీలను కొద్దీ రోజుల క్రితం ఈడీ అధికారులు విచారించారు..దుబాయి నుండి వీళ్ళ అకౌంట్ లోకి వచ్చిన ఫండ్స్ గురించి లెక్క చెప్పాలంటూ విచారించారు..ఇక ఈరోజు ఆ సినిమాలో హీరో గా నటించిన విజయ్ దేవరకొండ ని విచారించారు ఈడీ అధికారులు..సుమారు 11 గంటల పాటు ఈ విచారణ విజయ్ దేవరకొండ పై పలు కోణాల్లో విచారించారు ఈడీ అధికారులు.
ఇక విచారణ పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండ మీడియా తో మాట్లాడాడు..’ఒక్కోసారి పాపులారిటీ మరియు క్రేజ్ వల్ల సమస్యలు తలెత్తుతాయి..ఈరోజు నాకు అదే జరిగింది..అభిమానులు చూపించే మితిమీరిన అభిమానం వల్లే ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్నాను..నా జీవితం లో ఈ అనుభవం ని మర్చిపోలేను..ఈడీ అధికారుల విచారణకి సంపూర్ణంగా సహకరించాను..వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సూటిగానే సమాధానం ఇచ్చాను..మరోసారి విచారణకి రమ్మని నాకేమి చెప్పలేదు’ అంటూ విజయ్ దేవరకొండ మీడియా తో మాట్లాడాడు.

ఈ విచారణ లో ఫండ్స్ మొత్తం దుబాయి అకౌంట్ కి పంపించి ..అక్కడి నుండి సినిమాలో పెట్టుబడులకు ఉపయోగించారని ఈడీ అధికారుల విచారణలో తేలింది..అంతే కాకుండా ఈ పెట్టుబడుల వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తుంది..రాబొయ్యే రోజుల్లో ‘లైగర్’ లావాదేవీల వ్యవహారం లో ఈడీ అధికారులు ఇంకా ఎంతమందిని విచారిస్తారో చూడాలి.