Hyderabad Accident: అతివేగం ప్రమాదకరం. ప్రాణాలకే ప్రమాదం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఇలాంటి స్లోగన్స్ ఎన్ని చెప్పినా, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, కళ్ల ముందు ఘోర ప్రమాదాలు జరుగుతున్నా.. చాలా మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎలాంటి తప్పు చేయని అమాయకులు ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఎలాంటి ఘోర ప్రమాదాలు జరిగాయో, జరుగుతున్నాయో కళ్లారా చూస్తున్నాం. అయినా ఇంకా కొందరిలో మార్పు రాకపోడం బాధాకరం.
హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్‌పై..
తాజాగా హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ ఫ్లై్లఓవర్ పైనుంచి∙కింద పడటంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.
కోల్‌కతా యువతి..
కోల్‌కతాకు చెందిన స్వీటీ పాండే(22) తన స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా, అజాగ్రత్తగా బైకు నడిపటంతో యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై నియంత్రణ కోల్పోయిన రాయన్ ల్యూకే.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌ను ఢీకొట్టాడు. దాంతో బైక్ వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి కింద రోడ్డుపై పడింది. తీవ్రగాయాల పాలైంది. బైక్ నడుపుతున్న రాయన్ ల్యుకే ఫ్లైఓవర్ గోడను ఢీకొని గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వీటీ పాండే మృతి చెందింది. ఉదయం 4 గంటల సమయంలో జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై..
ఇటీవల హైదరాబాద్ చూసేందుకు వచ్చిన బంధువులను ఓ టెకీ బైక్‌పై తీసుకెళ్తుండగా అతివేగం కారణంగా అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. తాజాగా ఓ కారు తీగలవంతెనపై అతివేగం కారణంగా పల్టీ కొట్టింది. ఈ ఘటనలోనూ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు హై స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు. నగరంలో ఎన్ని నిబంధనలు పెట్టినా వాహనదారులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవం లేకుండా డ్రైవింగ్ చేయడం, అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.