Mr Pregnant Review: బిగ్ బాస్ షో ద్వారా అందరికీ పరిచయం అయిన సోహైల్ కు సినిమాల్లోకి రావాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఈ షో తరువాత అతనికి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ హీరోగా చేయాలన్న తన ఆరాటం ఇన్నాళ్లకు ఫలించింది. బిగ్ బాస్ షో తరువాత సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ కావడానికి చాలా సమయం తీసుకుంది. మొత్తానికి ఆగస్టు 18 శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమా ఎలా ఉందో చూద్దాం..
నటీనటులు:
సయ్యద్ సోహైల్
రూప కొడువాయూర్
సుహాసిని
మణిరత్నం
రాజా రవీంద్ర
బ్రహ్మాజీ
అలీ
వైవా హర్ష
అభిషేక్
సాంకేతికం:
డైరెక్టర్: శ్రీనివాస్ వింజనంపాటి
నిర్మాతలు: అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కథ:
గౌతమ్ (సోహైల్) ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. పెద్దయ్యాక టాటూ ఆర్టిస్ట్ గా మారిపోతాడు. గౌతమ్ ను మహి(రూప కొడువాయూర్) ఇష్టపడుతుంది. కానీ ముందుగా మహిని రిజెక్ట్ చేస్తాడు. కానీ ఆమె పట్టువదలకుండా గౌతమ్ వెంట పడుతుంది. అయితే గౌతమ్ పెట్టిన కొన్ని షరతులకు ఒప్పుకుంటేనే ప్రేమిస్తానంటాడు. వాటికి మహి ఒప్పుకుంటుంది. అయితే మహి తండ్రి (రాజా రవీంద్ర)వీరి ప్రేమకు అడ్డుపడతాడు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ గౌతమ్ ను మహి పెళ్లి చేసుకుంటుంది. అయితే కొన్నాళ్ల తరువాత మహి గర్భవతి అవుతుంది. కానీ ఇది గౌతమ్ కు ఇష్టం లేదు. దీంతో ఆమెకు దూరంగా ఉంటాడు. ఆ తరువాత మహిని అర్థం చేసుకుంటాడు. అయితే తన మహి గర్భాన్ని గౌతమ్ తన కడుపులో వేసుకుంటాడు. ఇలా గౌతమ్ వినూత్న నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అనేదే సినిమా కథాంశం.
విశ్లేషణ:
మగవాళ్లు బిడ్డను కన్న విషయాలు ఇదివరకే విన్నాం. కానీ ఆడవాళ్లు గర్భంతో ఉన్నప్పుడు పొందే అనుభూతిని తాను కూడా పొందాలనే ఉద్దేశంతో గౌతమ్ తన కడుపులో గర్భం వేసుకుంటాడు. ఇది కొత్త పాయింట్. అందుకే ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది. మూవీ ఫస్టాఫ్ మొత్తం స్లో నేరేషన్ ఉంది. మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటుంది. అయితే లవ్ ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక సెకండాఫ్ లో సోహైల్ గర్భంతో ఉన్న సన్నివేశాలు, ఇదే సమయంలో కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. బ్రహ్మాజీ, అభిషేక్ లు తమ కామెడీతో అదరగొట్టారు. సోహైల్ కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు తీసిన సీన్స్ ఆకట్టుకున్నాయి. అయితే చివరిలో మళ్లీ రొటీన్ గా విలన్ ఎంట్రీ కావడంతో కామన్ స్టోరీలా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
వినూత్న కథను ఎంచుకున్న సోహైల్ తన పాత్రలో లీనమై పోయాడు. సెకండాఫ్ చివరిలో హీరో పాత్ర కంటే మిగతా పాత్రలకే ప్రాధాన్యత ఉండడంతో సోహైల్ పర్ఫామెన్ష్ కనిపించదు. లవ్ ఎమోషనల్ లో రూప బాగా నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. వైవా హర్ష ఓ వైపు కామెడీ చేస్తూ.. మరోవైపు ఎమోషనల్ నటుడిగా కనిపించాడు. ఇతర కమెడియన్లు, సహాయ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం ఎలా ఉందంటే?
డైరెక్టర్ శ్రీనివాస్ మంచి కథను ఎంచుకోవడమే కాకుండా దానిని చూపించడంలో సక్సెస్ అయ్యారు. సినిమా టోగ్రఫీ విధానంతో సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు. శ్రావణ్ భరద్వాజ్ మనసుపెట్టి సంగీతాన్ని అందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత ఆకట్టుకుంటుంది. సినిమా ఫస్టాఫ్ లో ఎడిటింగ్ పనితీరు కనిపించదు. కానీ సెకండాఫ్ లో మాత్రం బోర్ కొట్టకుండా సన్నివేశాలను జోడించారు. నిర్మాతలు అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జలలు సినిమాల వాల్యూస్ ను రిచ్ ప్రొడక్షన్స్ వాడారు.
ముగింపు:
బిడ్డను కనే ముందు ఆడవాళ్లు పడే తపన కొందరికి అర్థం కాదు. ఆ బాధ తెలియాలంటే మగవాళ్లు కూడా గర్భం దాలిస్తే ఎలా ఉంటుంది? అనే భావోద్వేగ సన్నివేశాలతో సినిమా ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2.75/5