https://oktelugu.com/

Isha Ambani: నలుపు, తెలుపు రంగుల కలయిక.. ఇషా అంబానీ ధరించిన ఈ డ్రెస్ ధర తెలిస్తే గుండె ఆగిపోతుంది

ఇటీవల తన సోదరుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ఇషా అంబానీ మెరిసిపోయింది. అద్భుతమైన డ్రస్సులు ధరించి జిగేల్ మనిపించింది. ప్రత్యేకమైన డిజైనర్లు రూపొందించిన ఆ డ్రెస్సులు ఇషా కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 21, 2024 / 02:51 PM IST

    Isha Piramal Ambani

    Follow us on

    Isha Ambani: కొప్పున్న(జుట్టు) మహిళ సిగను  ఎలాగైనా ముడుస్తుంది.. అలాగే డబ్బున్న మహిళ ఎలాంటి దుస్తులనైనా ధరిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటుంది. ఈ అన్వయం భారతదేశం కుబేరుడు ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానికి అచ్చ గుద్దినట్టు సరిపోతుంది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో ఆమె ధరించిన దుస్తుల విలువ 9 లక్షలు. ఇది మనకు నోరేళ్లపెట్టే అమౌంట్ కావచ్చు గాని.. ఇషా అంబానికి జస్ట్ తొమ్మిది లక్షలు మాత్రమే..

    ఇటీవల తన సోదరుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ఇషా అంబానీ మెరిసిపోయింది. అద్భుతమైన డ్రస్సులు ధరించి జిగేల్ మనిపించింది. ప్రత్యేకమైన డిజైనర్లు రూపొందించిన ఆ డ్రెస్సులు ఇషా కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా అనంత వివాహ వేడుకలో గులాబీ రంగు లెహంగా ధరించి ఇషా అంబానీ జాతీయ మీడియాతో పాటు, అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది.. ఇప్పుడు మాత్రమే కాదు మా ఇంట్లో ఎలాంటి వేడుకలు జరిగినా ఇషా అద్భుతమైన డ్రస్సులు ధరించి అదరగొడుతుంది. ఫ్యాషన్ ఐ కాన్ గా హొయలు పోతుంది. తాజాగా జరిగిన ఓ వేడుకలో ఇషా తెలుపు, నలుపు రంగుల కలబోతతో కూడిన ఓ డ్రస్ ధరించి ఆకట్టుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.

    ముంబై అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో..

    ఇటీవల ముంబై మహానగరంలో అవార్డ్స్ నైట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇషా ముఖ్యఅతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ధరించిన షియాపరెల్లి మోడల్ డ్రెస్ ఆకట్టుకుంది.. ముంబైలో హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఇచ్చే అవార్డుల కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇషా ఇటాలియన్ డిజైన్ లో ప్రఖ్యాతమైన షియాపరెల్లి నమూనా బ్లాక్, అండ్ వైట్ డ్రెస్ ధరించింది.. ఈ డ్రెస్ పై బంగారు బటన్స్ జమ చేశారు. పియర్సింగ్,  డీటెయిల్ స్కర్ట్ (నలుపు రంగు) లో ఇషా దేవకన్య లాగా కనిపించింది. ఈ దుస్తులతో పాటు ఆమె మెరిసే భారీ స్టడ్ లను ధరించింది. జుట్టును లూజ్ గా వదిలేసింది. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఇషా.. ఈ డ్రెస్ లో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య లాగా.. ఆపిల్ బ్యూటీ లాగా ఆకట్టుకున్నది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ” ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ..ఇషా ఇప్పటికీ అంతే అందంతో కనిపిస్తున్నారు. ఆమె వ్యాపారంలో మునిగిపోయింది కాబట్టి.. సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు. ఒకవేళ ఆమె బాలీవుడ్ నటి అయి ఉంటే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. అయినప్పటికీ ఆమె ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా బాలీవుడ్ మొత్తం హాజరవుతున్నదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.