
NTR Emotional Comments: అభిమానులందరూ జూనియర్ ఎన్టీఆర్ అమెరికా రాక కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఎందుకంటే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ ఈవెంట్స్ అన్నిటికీ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్న చనిపోయిన కారణంగా రాలేకపోయాడు.కానీ ఈ ఆదివారం రోజు జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి మాత్రం హాజరు కానున్నాడు.అందుకోసం ఆయన ఈరోజే అమెరికా కి చేరుకున్నాడు.అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన వెంటనే అభిమానులు ఆయనకీ కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ అభిమానులతో కాసేపు ముచ్చటించిన తీరు అందరికీ ఎంతగానో నచ్చింది.ఒక రేంజ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, గ్లోబల్ వైడ్ పాపులారిటీ ని దక్కించుకున్న హీరో ఇంత సింపుల్ గా, స్నేహపూర్వకంగా అభిమానులతో ఉంటాడా అని ఆశ్చర్యపోక తప్పదు ఆ వీడియోలు చూస్తే.అభిమానులను ప్రేమగా పలకరించడమే కాకుండా, వాళ్ళ తల్లితండ్రులతో కూడా వీడియో కాల్ లో మాట్లాడుతాడు.
అభిమానులను దేవుళ్లుగా భావించే హీరోలలో ఒకడిగా ఎన్టీఆర్ ని చూడొచ్చు అనేది ఈ వీడియోస్ ని చూసి అర్థం చేసుకోవచ్చు.ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నా రక్తసంబంధం కంటే ఎక్కువ మీరు..మీరు చూపించే అభిమానం నాపై ఎవ్వరూ చూపించలేరు.మరో జన్మ అంటూ ఉంటే ఇలాంటి ప్రేమని ఇచ్చే అభిమానులే కావాలని కోరుకుంటాను’ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇక ఈ ఆదివారం ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా మాట్లాడబోతున్నాడో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లాగానే, ‘నాటు నాటు’ పాటకి కూడా ఆస్కార్ అవార్డ్స్ వచ్చేస్తే బాగుండును అని కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియన్ ఆడియన్స్ మొత్తం కోరుకుంటున్నారు..చూడాలి మరి ఆస్కార్ వస్తుందా లేదా అనేది.