
Janhvi Kapoor Remuneration: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా భారీ హైప్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు.ఆమె ముట్టుకున్నా బాలీవుడ్ సినిమాలన్నీ భస్మం అయిపోయాయి.కానీ తనకి ఉన్న అందం వల్ల ఈ అమ్మడుకి కుర్రకారులో క్రేజ్ మామూలుగా లేదు.ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని తన తల్లిలాగానే ఎలేస్తుంది అనే నమ్మకం ఏమో, ఆమె రెమ్యూనరేషన్స్ విషయం లో నిర్మాతలకు ఇప్పటికీ చుక్కలు చూపిస్తుందట.
కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని, స్టార్ హీరోలతో ప్రతీ భాషలో నటిస్తున్న టాప్ లీడింగ్ హీరోయిన్స్ కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట.ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుందని ఆ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ చిత్రం లో నటించడానికి కోసం జాన్వీ కపూర్ 5 కోట్ల రూపాయిల పారితోషికం ని డిమాండ్ చేస్తుందట.ఇంత మొత్తం లో ప్రస్తుతం తో లీడింగ్ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న రష్మిక , పూజ హెగ్డే వంటి వాళ్ళు కూడా రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకుంటున్నారు.అలాంటిది జాన్వీ కపూర్ తన తొలి తెలుగు సినిమాతోనే వాళ్ళని మించి తెలుగు లో మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తుంది అంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు.
ఇంత ఖర్చు పెట్టి ఆమెని ఇక్కడకి తీసుకోవడం ఎందుకు దందాగా , మన టాలీవుడ్ లో వేరే హీరోయిన్స్ లేరా.ఎందుకు ఇలా డబ్బుల్ని వృధా చేస్తారు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వస్తున్నాయి.శ్రీ లీల సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ ని పెట్టుకుంటే సినిమాకి ఎంతో ప్లస్ అయ్యేదని ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు.