Mallareddy : సినిమాల్లో అందమైన హీరో ఎవరంటే ప్రభాస్ అని చాలా మంది అంటారు. ఇక అమ్మాయిలకు క్యూట్ గా కనిపించే ప్రభాస్ తో ఒక్క సెల్ఫీ అయినా దిగాలని కోరుకుంటారు. కానీ ప్రభాస్ అందగాడు కాదట. ఆయన కంటే ఓ కుర్ర హీరోనే అందంగా ఉన్నాడట. ప్రభాస్ ది కేవలం మేకప్ మాత్రమేనని, ఆయనది రియల్ బ్యూటీ అంట. ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ‘మేము ఫేమస్’ అనే మూవీ టీజర్ కు అటెండ్ అయిన ఆయన చాలా విషయాలు మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి ఈ మధ్య ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్నారు. ఎందుకంటే ఎవరూ ఊహించని షాకింగ్ డైలాగ్స్ ఆయన నుంచి వెలువడుతాయి. లేటేస్టుగా ప్రభాస్ అందగాడు కాదు అని చెప్పేసరికి ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా? మంత్రిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మంత్రి ఎందుకలా అన్నాడో చూద్దాం.
సుమంత్ ప్రభాస్ డైరెక్షన్లో అనురాగ్ రెడ్డి శరత్ చంద్ర మనోహరం సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మేము ఫేమస్’ టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథతో రూపొందించిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మేకింగ్ అవుతున్న ఈ మూవీ టీజర్ ప్రతి ఒక్కరినీ ఆ కట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి తెలంగాన మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. సాధారణంగానే జోష్ ఉండే ఆయన ఈ వేడుకలో తన డైలగ్స్ తో మరింత ఊపు తెచ్చారు.
ఈ సందర్భంగా ముందుగా మంత్రి చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పారు. అయితే ఇందులో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ ను మంత్రి మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ఆ హీరో ప్రభాస్ అందగాడు కాదని, అసలైన మేకప్ లేని అందగాడు ఈ ప్రభాస్ అని మంత్రి అనడంతో అక్కడున్న వాళ్లంతో ఈలలతో గోల చేశారు. అలాగే మన తెలంగాణ ప్రభాస్ అంటూ టైటిల్ గురించి ఆయనను అభినందించారు.
ప్రపంచం మొత్తంగా మన తెలంగాణలో 65 శాతం యూత్ ఉందన్నారు. కేటీఆర్ ప్రపంచంలో నంబర్ వన్ మినిస్టర్ అని అన్నారు. అయితే ఊరికే ఎవరు ఫేమస్ కాదు. దాని కోసం ఎంతో కష్టపడాలి అని అన్నారు. ఈమధ్య నేను ఫుల్ ఫేమస్ అయ్యా.. నేను తుమ్ముతే కూడా ట్రెండింగ్ అవుతోంది. అలా మారాలి. అందరూ..అని అన్నారు. అందుకోసం నేనేంతో హర్డ్ వర్క్ చేశానని అన్నారు. ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లను నేను తయారు చేశానని అన్నారు.
ఇక మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మంత్రిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆయన వీడియోస్ తో మీమ్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. గతంలో ఆయన విసిరిన చలోక్తులు, ప్రసంగాలను కామెడీ రూపంలో వీడియోలు మేకింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మంత్రి మల్లారెడ్డి రాజకీయంగా చేసిన ప్రసంగాలు సాధారణంగా వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.