Janasena Vs YCP: ఎన్నికల ముందు హామీల వర్షం కురిపిస్తారు. సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించకుండా మాట ఇచ్చేస్తారు. తీరా అధికారంలోకి రాగానే మాట మార్చేస్తారు. సాధ్యమైతే ఇస్తామంటూ సన్నాయినొక్కులు నొక్కుతారు. ప్రశ్నస్తే ప్రతిపక్షాల పై విరుచుకుపడతారు. ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కళ్లొబొల్లి మాటలతో కాలం సాగదీస్తారు. అనుకూల మీడియాతో దుమ్మెత్తిపోయిస్తారు. ఇది ఏపీలో అధికార పార్టీ తీరు. యువతకు ఉద్యోగాలడిగితే.. అక్కడ ప్రశ్నించలేదేం.. ఇక్కడ ప్రశ్నిస్తున్నారేం అంటూ కూలీ మీడియాతో ఎదురుదాడి చేయిస్తున్నారు.

వైసీపీ పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు శూన్యం. పరిశ్రమలు ఏపీ నుంచి పారిపోయిన ఉదాహరణలు కోకొల్లలు. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించింది వైసీపీనే. పారిశ్రామికాభివృద్ది జరగకపోతే యువతకు ఉపాధి దొరకదు. ఉపాధి దొరకకపోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతాయి. దేశంలోని అందరి వ్యక్తిగత అభివృద్ధే దేశాభివృద్ధి అవుతుంది. ఏపీకి పెట్టుబడులు రాకపోవడం వల్ల యువతకు ఉపాధి మృగ్యమవుతోంది. సుదూర ప్రాంతాలకు వలసపోవాల్సిన పరిస్థితి. అదే సొంత రాష్ట్రంలో ఉపాధి ఉంటే రాష్ట్రానికి ఆదాయం.. యువతకు ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే ప్రభుత్వం అప్పులు చేసే పరిస్థితి ఉండదు. ఆ అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు. వైసీపీ ప్రభుత్వం ఇంత చిన్న లాజిక్ ను ఎందుకు మిస్సవుతుందో తెలియదు.
ఏపీలోని సచివాలయ ఉద్యోగాలు, వాలంటీరు ఉద్యోగాలు, మటన్ కొట్టులు, చేపల మార్ట్ లను ప్రతిపక్షాలు చిన్నచూపుచూస్తున్నాయని వైసీపీ అనుకూల మీడియాలో విమర్శలు చేయిస్తున్నారు. శ్రమైక జీవన విధానం గురించి లెక్చర్లు చెప్పిస్తున్నారు. శ్రమ అవసరమే. శ్రమను గౌరవించాలి. గుర్తించాలి. శ్రమలేనిది ఏదీ సాధ్యం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నది ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల గురించి కాదు. ఇవ్వాల్సిన ఉద్యోగాల గురించి. ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ ప్రకటిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క జాబ్ కేలండర్ ప్రకటించలేదు. దీని గురించి ఏం సమాధానం చెబుతారో వైసీపీ ఆలోచించుకోవాలి.

ఏపీలో లక్షలాది మంది బీటెక్ , డిగ్రీ చదివిన విద్యార్థులు ఉన్నారు. వారికి వాలంటీరు ఉద్యోగం, మటన్, చేపల కొట్లు పెట్టించే బదులు.. నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చేలా చేయొచ్చు కదా. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించొచ్చు. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ది చెందుతాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలకూ వివిధ రూపాల్లో పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకానీ కేవలం మటన్, చేపల కొట్లతో కాదనేది ప్రతిపక్షాల విమర్శల సారాంశం. అంతే కానీ శ్రమను అగౌరవపరచాలనేది ప్రతిపక్షాల ఉద్దేశ్యం కాదు. కానీ తమ తప్పు కప్పిపెట్టడానికి వైసీపీ అనుకూల మీడియాతో శ్రమ, గౌరవం అంటూ ప్రతిపక్షాల పై ఎదురుదాడి చేయిస్తున్నారు.
వాలంటీరు ఉద్యోగం ఎవరికిచ్చారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారు. ఆ కార్యకర్త చదువుకున్నాడా ? లేదా ? అనేది చూడాకుండా వాలంటీరుగా నియమించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు కానీ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అని కాదు కదా. మరి అలాంటప్పుడు వైసీపీ వారికే పెద్ద పీఠ ఎందుకని జనసేన ప్రశ్నిస్తోంది. అంతే కానీ ఇది ఎక్కువ .. అది తక్కువ అంటూ ఏ ఉద్యోగాన్ని, ఉద్యోగిని జనసేన కించపరచలేదు. లక్షలాదిగా ఉన్న యువశక్తిని సరైన మార్గంలో నడిపిస్తే అద్భుతాలు జరుగుతాయని జనసేన నమ్ముతోంది. ఆ మార్గంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తోంది. కానీ వైసీపీ అనుకూల మీడియా జనసేన ఉద్దేశాన్ని వక్రీకరించి భాష్యం చెబుతోంది. మటన్, చికెన్, చేపల కొట్లు అవసరమే. లక్షలాది ఇంజినీర్లు ఉన్న రాష్ట్రంలో ఐటీ కంపెనీలు అత్యవసరమే. చదువుకు తగ్గ ఉద్యోగం, జీతం కావాలనుకోవడం తప్పు కాదు.