https://oktelugu.com/

Yashoda First Review: ‘యశోద’ మొట్టమొదటి రివ్యూ..టాలీవుడ్ నుండి మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్

Yashoda First Review: సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యశోద చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతుంది..ఈ చిత్రానికి దర్శకులుగా హరి – హరీష్ వ్యవహరించారు..టీజర్, ట్రైలర్స్ తో అభిమానులను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ నుండి రాబోతున్న మరో బ్లాక్ బస్టర్ హిట్ అని అర్థం అయిపోతుంది. ఇందులో సమంత ఒక […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2022 / 08:24 PM IST
    Follow us on

    Yashoda First Review: సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యశోద చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతుంది..ఈ చిత్రానికి దర్శకులుగా హరి – హరీష్ వ్యవహరించారు..టీజర్, ట్రైలర్స్ తో అభిమానులను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ నుండి రాబోతున్న మరో బ్లాక్ బస్టర్ హిట్ అని అర్థం అయిపోతుంది.

    ఇందులో సమంత ఒక గర్భిణీ స్త్రీ గా నటించింది..ఆమెతో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళి శర్మ మరియు సంపత్ ప్రధాన పాత్రలు పోషించగా మణిశర్మ సంగీతం అందించారు..రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి దుబాయి లో మీడియా ప్రతినిధులకు ప్రత్యేకమైన ప్రివ్యూ షో ని ఏర్పాటు చేసారు..ఈ ప్రివ్యూ షో టాక్ అదిరిపోయింది..సినిమా ని చూసిన ప్రతి ఒక్కరు సమంత నటనకి ఫిదా అయిపోయినట్టు సమాచారం.

    ‘యశోద’ కథ ఏంటంటే.. సరోగసి ద్వారా ధనవంతుల కుటుంబానికి ఒక బిడ్డకి జన్మనివ్వడానికి సమంత ఒప్పుకుంటుంది..అలా ఒక కాంట్రాక్టు డీల్ మీద ల్యాబ్ లోకి వచ్చిన సమంత కి అనుకోని సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి..అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది..ఎందుకు తనని ట్రాప్ చేసి దాడి చేయాలనుకుంటున్నారు అనేది చాలా సస్పెన్స్ తో కూడిన థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో చాలా గ్రిప్పింగ్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లే నడుస్తుంది..సమంత ఇందులో తన నటవిశ్వరూపాన్ని చూపించిందట..అన్ని రకాల ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపారేస్తుందట.

    అంతే కాకుండా యాక్షన్ సన్నివేశాలు కూడా అదరగొట్టేసింది టాక్ వినిపిస్తుంది..ఇది వరకే మనం ట్రైలర్ లో సమంత ఫైట్స్ చేయడం చూసాము..సినిమాలో అలాంటి పోరాట సన్నివేశాలు చాలానే ఉన్నాయట..ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి అన్నీ ఈ సినిమాకి కలిసొచ్చాయట..వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా చాలా బాగా వచ్చినట్టు సమాచారం..దుబాయి నుండి వచ్చిన ఈ టాక్ అదిరిపోయింది..కానీ ఇదే రేంజ్ టాక్ రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి వస్తుందా లేదా అనేది చూడాలి.