World Powerful Passport In 2023: ఇటీవల మనం పాస్‌పోర్టు అవసరం లేకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే ఇద్దరు ప్రముఖుల గురించి తెలుసుకున్నాం. యూకే రాజు, జపాన్ రాజు, రాణికి మాత్రమే పాస్‌పోర్టు అవసరం లేకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు గురించి తెలుసుకుందా. ఎందుకు శక్తివంతమైందంటే.. ఈ ఒక్క పాస్‌పోర్టుతో ప్రపంచంలోని 192 దేశాలను చుట్టిరావొచ్చు. అందుకే ఇది అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది. మరి ఈ పాస్‌పోర్టు ఏమిటి.. ఎలా తీసుకోవాలి.. ఎవరు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఐఏటీఏ డేటా ఆధారంగా..
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ 2023లో శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం (ఐఏటీఏ) నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఆసక్తికరంగా, ఐదేళ్లుగా పవర్‌ఫుల్ పాస్పోర్ట్‌ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న జపాన్ మూడో స్థానానికి దిగజారింది. డెన్మార్క్,ఐర్లాండ్,నెదర్లాండ్, యూకేలు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక పదేళ్ల క్రితం శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. కాలక్రమేణా ఆ పాస్‌పోర్ట్ స్థానం మరింత దిగజారుతూ వచ్చింది. 2017లో ఏకంగా రెండోస్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.
పరోక్షంగా చైనానే కారణమా?
చైనాలో భౌగోళిక రాజకీయ అంశాల కారంగా డ్రాగన్ దేశం చైనాలో ప్రైవేట్ సంస్థలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. దీంతో వ్యాపారులు, సామాన్యులు సింగపూర్‌కు వలస వెళ్లారు. మరోవైపు ఆర్ధికంగా పుంజుకోవడం వంటి అంశాలు సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అంత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అవతరించేందుకు దోహదపడినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

192 దేశాలకు వెళ్లే అవకాశం..
2023 జాబితా ప్రకారం సింగపూర్ పాస్‌పోర్టు ఉన్నవారు. ప్రపంచంలోని 192 దేశాలు చుట్టిరావొచ్చు. ఆర్థికంగా బటపడిన సింగపూర్ వాసులను 192 దేశాలు ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ పాస్‌పోర్టు పొందడం సింగపూర్ పౌరులకు మాత్రమే సాధ్యం. అక్కడి పౌరసత్వం లేనివారికి పాస్‌పోర్టు జారీ చేయరు.