
Donald Trump: హుష్ మనీ కేసులో అరెస్టయి, విడుదలైన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నోటికి పని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ” నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా దాడి జరిగేది కాదు” అని వ్యాఖ్యానించాడు.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.. అంతే కాదు జో బైడెన్ ను ఐదో ఫెయిల్యూర్ అధ్యక్షుడని వ్యాఖ్యానించాడు. బైడెన్ హయాంలో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, అణు యుద్ధం కారణంగా మానవాళికి ముప్పు ఏర్పడుతుందని ట్రంప్ జోస్యం చెప్పాడు. అమెరికా చరిత్రలోనే బైడెన్ ను అత్యంత విఫల అధ్యక్షుడిగా ట్రంప్ అభివర్ణించాడు.
“బైడెన్ హయాంలో అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారి పోయింది. అగ్రరాజ్యం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది” అని ట్రంప్ వాపోయాడు.. స్టార్మ్ డేనియల్స్ తో లైంగిక సంబంధాన్ని దాచి పెట్టేందుకు ఆమెకు 1.3 లక్షల డాలర్లు ఇచ్చిన “హుష్ మనీ” కేసులో మంగళవారం మన్ హాట్టన్ కోర్టులో ట్రంప్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విడుదలైన ట్రంప్.. ఫ్లోరిడాలోని తన రిసార్ట్ కు చేరుకున్నారు. అక్కడ విలేకరుల సమావేశంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
” అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇతర దేశాలు ఆయుధాలు, అణ్వాయుధాల గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఇప్పుడు బైడెన్ పాలన వల్ల అమెరికా పరిస్థితి దిగజారుతోంది. ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం తగ్గిపోతున్నది. బైడెన్ హయాంలో అణు యుద్ధం జరగనుంది. రష్యా, చైనా ఒక్కటయ్యాయి. సౌదీ, ఇరాన్ ఒక్కటయ్యాయి. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు. అసలు రష్యా ఉక్రెయిన్ దేశంపై దాడి చేసేది కూడా కాదు.. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా ఒక్కటయ్యాయి. ఇప్పుడు ప్రపంచం పాలిట అవి శత్రువులుగా పరిణమించాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ” ప్రపంచవ్యాప్తంగా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. డాలర్ విలువ దిగజారి పోతోంది. గత రెండు వందల ఏళ్లలో ఇది అమెరికాకు భారీ ఓటమి లాంటిది.” అని ట్రంప్ వివరించారు.

ఇక హుష్ మనీ కేసులో ట్రంప్ ను కాపాడటం ఎవరి తరమూ కాదని భారతీయ అమెరికన్ అటార్నీ రవి బాట్ర అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తదుపరి విచారణ డిసెంబర్ 4న ఉందని, గా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు నెలల ముందు జరిగే విచారణలో ఏమైనా జరగొచ్చని ఆయన చెబుతున్నారు. ఇక కాలీ ఫోర్నియా కోర్టులో స్టార్మీ డేనియల్స్ కు చుక్కెదురైంది. ట్రంప్ న కు 1.2 లక్షల డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ డబ్బు కోసమే ఆమె బెదిరింపులకు పాల్పడుతోంని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీనిపై డేనియల్స్ 2018లో పరువు నష్టం దావా వేసి ఓడిపోయారు. అయితే ట్రంప్ తరఫున న్యాయవాదులకు 2.93 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలని స్థానిక కోర్టు అప్పట్లో ఆమెను ఆదేశించింది. పై కోర్టుకు ఆమె ఆప్పీల్ చేసుకున్నప్పటికీ అక్కడ కూడా మరో 2.45 లక్షల డాలర్ల ఫైన్ పడింది.. కాలిఫోర్నియా కోర్టులో ఆమె ఆప్పీల్ చేయగా ఆ కోర్టు కూడా ఆమెకు 1.2 లక్షల డాలర్లు అపరాధ రుసుం విధించింది. మొత్తానికి ఈ పరిణామం అంతర్జాతీయంగా చర్చనీయాశంగా మారింది.