Homeజాతీయ వార్తలుMLA Durgam Chinnaiah: రసిక లీలలు.. నిన్న రాజయ్య.. నేడు చిన్నయ్య.. బీఆర్‌ఎస్‌లో రేపు ఎవరో!?

MLA Durgam Chinnaiah: రసిక లీలలు.. నిన్న రాజయ్య.. నేడు చిన్నయ్య.. బీఆర్‌ఎస్‌లో రేపు ఎవరో!?

MLA Durgam Chinnaiah
MLA Durgam Chinnaiah

MLA Durgam Chinnaiah: తొమ్మిదేళ్లు అధికారం.. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా ఎవరూ ఎదురు చెప్పరు అన్న ధీమా.. పొరపాటున ఎవరైనా ఫిర్యాదు చేసినా.. పోలీసులు తాము ఏం చెబితే అదే చేస్తారన్న అహంభావం.. ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారం ఒకవైపు.. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోరికలు తీర్చుకోవాలన్న ఆకాంక్ష మరోవైపు వెరసి బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామో లేదో.. టికెట్‌ వస్తుందో లేదో అన్న ధోరణితో మహిళలను చెరబట్టాలని చూస్తున్నారు. ఇలా మొన్న స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య సొంతపార్టీ సర్పంచ్‌పై కన్నేసి అడ్డంగా బుక్కయ్యాడు. తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఓ ప్రైవేటు డెయిరీ మహిళా ప్రతినిధులను పక్కలోకి రమ్మని చిక్కుల్లో పడ్డాడు.

ఆధారాలతో సహా బయటకు..
బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సామాన్యుడేం కాదు. అతనిపై గతంలో భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ ప్రైవేటు డెయిరీలో తన బావమరిదితో పెట్టుబడి పెట్టించాడు. అంతటితో ఆగకుండా వ్యాపారం గురించి చర్చించేందుకు డెయిరీ మహిళా డైరెక్టర్లను, ఉద్యోగులను హైదరాబాద్‌లోని తన ఇంటికి రప్పించుకున్నాడు. ఈ క్రమంలో కామంతో వారిపై కన్నేశాడు. తన కోరికలు తీర్చాలని వేధిస్తున్నాడు. ఓ మహిళా వ్యాపారిని వేధిస్తున్న ఆడియోతో పాటు వాట్సాప్‌ చాట్లు వెలగులోకి వచ్చాయి. . ఆయన రాసలీలల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

పక్కలోకి పంపితేనే వ్యాపార విస్తరణ..
డెయిరీ వ్యాపారం విస్తరించే క్రమంలో సంస్థ ప్రతినిధులు పలుమార్లు ఎమ్మెల్యేను కలిశారు. అయితే వ్యాపారం విస్తరించాలంటే అమ్మాయిల్ని తన వద్దకు పంపాలని చిన్నయ్య పలుమార్లు ఒత్తిడి చేశారని మహిళా డైరెక్టర్‌ ఆరోపిస్తున్నారు. తాను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయాన్ని వివరిస్తే పోలీసులు తనకు సహకరించలేదని చెబుతున్నారు. అయితే వారే అక్కడి జనాలను మోసం చేశారని కేసులు నమోదు చేయించారని ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే మూడు రోజులు స్టేషన్‌లో పెట్టించి వేధించారని తెలిపారు. ఆయన కోరిక తీర ్చనందుకే ఇలా చేశారని, చివరకు పోలీసులు కూడా ఎమ్మెల్యేను కలిస్తే అన్నీ సర్దుకుంటాయని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. తమకు ఏదైనా జరిగితే బెల్లంపల్లి పోలీసులు, ఎమ్మెల్యే చిన్నయ్య, ఆయన అనుచరులే బాధ్యులని స్పష్టం చేశారు.

MLA Durgam Chinnaiah
MLA Durgam Chinnaiah

అనేక వివాదాలు..
దుర్గం చిన్నయ్యపై గతంలోనూ వివాదాలు ఉన్నాయి. పలు భూ వివాదాలతోపాటు టోల్‌ ప్లాజా సిబ్బందిపై దాడి వ్యవహారంలోనూ ఆయన వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల వ్యవహారాలు బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి.

మూడేళ్ల క్రితం కరీనంగర్‌ జిల్లాకు చెందిన మంత్రిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. మొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం హాట్‌ టాపిక్‌ అయింది. ఇలాంటివి ఇంకా ఎన్ని బయటకు వస్తాయోనని బీఆర్‌ఎస్‌ పెద్దలు కూడా కంగారు పడుతున్నారు. సాధారణంగా ఇలాంటివి మీడియాలో హైలెట్‌ అవుతాయి. అందుకే ఎమ్మెల్యేలు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లవద్దని హెచ్చరికలు పంపుతోంది బీఆర్‌ఎస్‌ అధిష్టానం.

ఎప్పుడో చేసేసిన వ్యవహారాలు ఎన్నికల ఏడాదిలో బయటకు వస్తుండడం, వాటిని ఎలా అడ్డుకోవాలో తెలియకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టెన్షన్‌ పడుతున్నారు. మరి ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉంది.. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది గుట్టు రట్టవుతుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular