spot_img
Homeట్రెండింగ్ న్యూస్Revenge Love Story: ప్రియుడు మోసం చేశాడు.. ప్రతీకారంగా ప్రియురాలు ఏం చేసిందంటే..

Revenge Love Story: ప్రియుడు మోసం చేశాడు.. ప్రతీకారంగా ప్రియురాలు ఏం చేసిందంటే..

Revenge Love Story: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. మనం రకరకాల లవ్ స్టోరీస్, రివెంజ్ స్టోరీస్ చూస్తుంటాం, చదువుతుంటాం. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ పూర్తి డిఫరెంట్. ప్రేమ పేరుతో మోసం చేసిన తన ప్రియుడిపై ఒక ప్రియురాలు పగ తీర్చుకుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడి పై కక్ష తీర్చుకునేందుకు ప్రియురాలు.. ఏకంగా అతడి తండ్రిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఈ విషయాన్ని ఆ యువకుడి సోదరి సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేసింది.

ప్రేమ పేరుతో మోసం చేసిన తన సోదరుడిపై పై పగ తీర్చుకునేందుకు.. ఆ యువతి అతడి తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా మారిందని, ఆ ప్రియుడి సోదరి సోషల్ మీడియాలో పేర్కొన్నది. “ఆమెను నా సోదరుడు ప్రేమించాడు. కానీ, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడు వేరే వివాహం చేసుకోవడంతో ఆమె తీవ్రంగా మదనపడింది. తీవ్ర నిరాశ నిస్సృహలకు గురైంది. చివరికి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. మా మాతృమూర్తి చిన్నప్పుడే చనిపోవడంతో.. మా తండ్రికి రెండవ భార్యగా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మాకు ఎవరికీ తెలియకుండా మా తండ్రిని రెండో పెళ్లి చేసుకుంది. మా తండ్రి, ఆమె ఇద్దరూ పెళ్లి దుస్తులు, మెడలో పూలదండలతో మా ఇంట్లోకి రావడంతో ఒక్కసారిగా మేము షాక్ కు గురయ్యాంమని” ఆ యువతి రాస్కొచ్చింది.

“నా తమ్ముడి వివాహం రోజున అతడు, అతనికి కాబోయే భార్య తెల్ల రంగులో ఉన్న దుస్తులను ధరించారు. అయితే, మా తమ్ముడి చేతిలో మోసపోయిన యువతి కూడా ఆ రోజు తెల్లటి దుస్తులు ధరించి వివాహ వేదిక వద్దకు వచ్చింది.. ఆ వివాహానికి ఆమెను ఎవరు పిలిచారో మాకు అర్థం కాలేదు. మా తమ్ముడు, మరదలు కలిసి వివాహం అనంతరం ఫోటో దిగుతుండగా.. ఆమె కూడా వచ్చి వారి పక్కన నిలుచొని ఫోటోలు దిగింది. ఆమె పక్కన మా తండ్రి ఉండడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత మా తండ్రిని బుట్టలో వేసుకుంది. ఆయనను పెళ్లి చేసుకొని మాకు సవతి తల్లిగా మారింది.. ఆమె మా కుటుంబంలో చేరిన తర్వాత మా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత మాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయిందంటూ” టిక్ టాక్ ద్వారా ఆ యువతి తన కష్టాలు చెప్పుకుంది. అయితే ఆ యువతి పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. కొంతమంది ఆ యువకుడు చేసిన పనిని తప్పుపట్టగా.. మరికొందరేమో పగ, ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఆమె ఇలా చేసిందని.. చివరికి తన జీవితాన్నే నాశనం చేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. మాజీ ప్రియురాలు కాస్త సవతి తల్లిగా మారడం అనేది విధి వైచిత్రి కాకపోతే మరేమిటని మరి కొంతమంది వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES
spot_img

Most Popular