https://oktelugu.com/

Waltair Veerayya : రవితేజ లేకపోతే ‘వాల్తేరు వీరయ్య’ సినిమానే లేదు..మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Waltair Veerayya  : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే..ఈ ప్రీ రిలీజ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ , రాజేంద్ర ప్రసాద్, ఊర్వశి రౌతుల, దేవి శ్రీ ప్రసాద్ , శ్రీనివాస్ రెడ్డి , శేఖర్ మాస్టర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ అధినేత […]

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2022 / 11:23 PM IST
    Follow us on

    Waltair Veerayya  : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే..ఈ ప్రీ రిలీజ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ , రాజేంద్ర ప్రసాద్, ఊర్వశి రౌతుల, దేవి శ్రీ ప్రసాద్ , శ్రీనివాస్ రెడ్డి , శేఖర్ మాస్టర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ తదితరులు హాజరయ్యారు.

    ఈ ప్రెస్ మీట్ ద్వారా మూవీ లో ఉన్న హైలైట్స్..జనాలకి ఇది ఎలాంటి సినిమా అనేది స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసారు మూవీ యూనిట్..అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం లో మూవీ లో పని చేసిన అందరి గురించి మాట్లాడుతాడు కానీ, మాస్ మహారాజ రవితేజ గురించి మాత్రం కాస్త తక్కువగా మాట్లాడినట్టు అనిపించింది..దీనితో చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా రవితేజ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

    ఆయన మాట్లాడుతూ ‘వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఈరోజు మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది..ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నా సమయం లో టీం మొత్తం తమ అనుభవాలను పంచుకోవడం చాలా చక్కగా అనిపించింది..అయితే నాలో ఎక్కడో తెలియని అసంతృప్తి నెలకొంది..ఈ చిత్రానికి అత్యంత కీలకమైన వ్యక్తి..వీరయ్య కి ఆప్తుడు..నా తమ్ముడు రవితేజ గురించి ఎందుకో తక్కువగా మాట్లాడాను అని నాకు అనిపించింది..ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం వల్ల నా తమ్ముడు రవితేజ గురించి సరిగా మాట్లాడే అవకాశం రాలేదు..అందుకే ఈ ట్వీట్ వేస్తున్నాను..నేను అడగగానే వెంటనే రవితేజ ఒప్పుకోవడం , అతనితో కలిసి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నటించడం నాకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది..ఒకవేళ రవితేజ ఈ సినిమా ఒప్పుకోకపోయ్యుంటే ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అసంపూర్ణంగానే ఉండేది..డైరెక్టర్ బాబీ రవితేజ పాత్రని అద్భుతంగా తీర్చి దిద్దాడు..అతను మొదటి నుండి చెప్తూ వస్తున్న పూనకాలు లోడింగ్ లో రవితేజ పాత్ర చాలా కీలకం..ఆ విషయాలు మనం త్వరలోనే మాట్లాడుకుందాం’ అంటూ చిరంజీవి ట్విట్టర్ లో వేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.