Homeట్రెండింగ్ న్యూస్Unusual Eclipses: అసాధారణ గ్రహణాలతో.. విశ్వానికి విపత్తు.. ఇదిగో ఆధారాలు?

Unusual Eclipses: అసాధారణ గ్రహణాలతో.. విశ్వానికి విపత్తు.. ఇదిగో ఆధారాలు?

Unusual Eclipses: గ్రహణం.. సాధారణంగా వినే పదమే. ఏడాదిలో ఒకటో రెండో గ్రహణాలు రావడం సర్వసాధారణం. కానీ, కాలగమనంలో ఒక్కోసారి అసాధారణ గ్రహణాలు సంభవిస్తుంటాయి. జ్యోతిష్యపరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా చూసినా ఇవి ప్రమాదానికి, విపత్తుకు సూచికలే అంటున్నారు పండితులు, శాస్త్రవేత్తలు. గతంలో సంభవించిన అసాధారణ గ్రహణాలు, సంభవించిన విపత్తులను ఇందుకు ఉదహరిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎకుందుకు అంటే.. ఒకే నెలలో మనం రెండు గ్రహణాలను ఎదుర్కోబోతున్నాం. ఈ నెల 25న సూర్యగ్రహణం.. నవంబర్‌ 8న చంద్రగ్రహణం సంభవించబోతున్నాయి. గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబర్, నవంబర్‌లో గ్రహణాలు సంభవిస్తున్ను›్ల కనిపించినా.. తెలుగు మాసాల ప్రకారం రెండు గ్రహణాలు కార్తీక మాసంలో వస్తున్నాయి. కార్తీక శుద్ధ పాడ్యమి రోజు సూర్య గ్రహణం, కార్తీకశుద్ధ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం సంభవించబోతున్నాయి. అసాధారణమైన ఈ రెండు గ్రహణాలతోనూ విశ్వంలో ఏదో ఒక విపత్తు సంభవిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

Unusual Eclipses
Unusual Eclipses

మూడు నెలలు గ్రహణ ప్రభావం..
శాస్త్రం ప్రకారం.. ఏదైనా గ్రహణం సంభవించినప్పుడు దాని ప్రభావం వివిధ రాశులపై మూడునెలలు ఉంటుంది. ఫలితాలు మాత్రం ఆయా రాశుల బలం, నక్షత్ర గమనం ఆధారంగా ఉంటాయని పేర్కొంటున్నారు. పండితులు. గ్రహణాల వలన కొన్ని రాశులకు శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ శుభ, అశుభాలు మూడు నెలల్లో సంభవిస్తాయని పేర్కొంటున్నారు. వైదిక మాసం ప్రకారం.. 30 రోజుల వ్యవధిలో ఏర్పడుతున్న సూర్య, చంద్ర గ్రహణాల ప్రభావం కూడా మూడు నెలలు ఉంటుందని, ఫలితాలు కూడా మూడు నెలల్లో చూపుతాయని పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తలు కూడా శాస్త్రీయవాదుల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు. ఇందుకు ఆధారాలను కూడా శాస్త్రవేత్తలే చూపడం గమనార్హం.

1940 నుంచి రీసెర్చ్‌..
గ్రహణాలు, వాటి ప్రభావంపై శాస్త్రవేత్తలు కూడా 1940 నుంచి అధ్యయనం చేస్తున్నారు. గ్రహణాల ప్రభావంతో దుష్పలితాలు సంభవిస్తాయని పండితులు చెబుతుంటే.. శాస్త్రవేత్తల పరిశోధనలోనూ ఆ ఫలితాలు కనిపిస్తుండడం ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా వస్తున్న గ్రహణాల ప్రభావంతో మూడో ప్రపంచ యుద్ధం కూడా రావొచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు గత గ్రహణాల ఫలితాలను ప్రజలు ముందు ఉంచుతున్నారు.

Unusual Eclipses
Unusual Eclipses

1940 నుంచి సంభవించిన వరుస గ్రహణాలు, వాటి ప్రభావం..
– 1941, సెప్టెంబర్‌ 5న చంద్రగ్రహణం ఏర్పడింది. 21 సెప్టెంబర్‌ 1941లో సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ రెండు గ్రహణాలు భాద్రపదమాసంలోనే సంభవించాయి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఏర్పడిన ఈ గ్రహణాల ప్రభావంతో భారీగా జన నష్టం జరిగింది.

– 23, ఏప్రెల్‌ 1948లో చంద్రగ్రహణం, 09, మే, 1948లో సూర్యగ్రహణం ఏర్పడ్డాయి. ఈ రెండు గ్రహణాలు చైత్రమాసంలో సంభవించాయి. దీని ఫలితంగా 1948, మే 14న అరబ్‌ దేశాలు, ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధం జరిగింది. ఇదే ఆ దేశాల మధ్య జరిగిన తొలి యుద్ధం

– 10, ఫిబ్రవరి 1952న చంద్రగ్రహణం ఏర్పడింది 25, ఫిబ్రవరి 1952న సూర్య గ్రహణం ఏర్పడింది. ఇవి మాఘమాసంలో సంభించాయి. ఈ గ్రహణాల ప్రభావంతో మన దేశాన్ని పాలించిన బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జ్‌ – ఐV మరణించారు. ఇటీవల చనిపోయిన క్వీన్‌ ఎలిజిబెత్‌–ఐఐ, కింగ్‌జార్జ్‌ మరణానంతరం తన 27 ఏళ్ల వయసులో రాణిగా ఎంపికయ్యారు.

– 29, ఏప్రిల్‌ 1976లో సూర్యగ్రహణం, 19, మే, 1976లో చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. ఇవి రెండూ చైత్రమాసంలో సంభవించాయి. వీటి ప్రభావంతో భయంకరమైన భూకంపం వచ్చింది. చైనాలోని టంక్షన్‌ ప్రాంతంలో 28, జూలై 1976లో ఈ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో 6.55 లక్షల మంది చనిపోయారు.

– 15, డిసెంబర్, 1982న సూర్యగ్రహణం, 30 డిసెంబర్‌ 1982న చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. ఈ రెండు గ్రహణాలు కార్తీకమాసంలో వచ్చాయి. ఈ గ్రహణాల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అస్సాంలో 500పైగా దాడులు జరిగాయి. 5000 మంది అమాయక ప్రజలు చంపబడ్డారు.

– 22 ఆగస్టు 1998లో శ్రావణ మాసంలో సూర్యగ్రహణం, 06, సెప్టెంబర్‌ 1998లో భాద్రపద మాసంలో చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో కెన్యా, సౌత్‌ ఆఫ్రికా ఎంబసీలో బాంబు పేలుళ్లు జరిగాయి. వీటి ప్రభావంతో 5 వేల మంది మరణించారు.

Unusual Eclipses
Unusual Eclipses

– 03, అక్టోబర్‌ 2005న భాద్రపద మాసంలో సూర్యగ్రహణం ఏర్పడింది. 17, అక్టోబర్‌ 2005న ఆశ్వయిజ మాసంలో చంద్రగ్రహణం ఏర్పడింది. దీని ప్రభావంతో అక్టోబర్‌ 8న కశ్వీర్‌లో భూకంపం వచ్చింది. ఇందులో లక్ష మంది వరకు చనిపోయారు.

– 03, మార్చి 2007న చంద్రగ్రహణం, 19, మార్చి 2007లో సూర్యగ్రహణం సంభవించాయి. ఫాల్గునమాసంలో ఏర్పడిన ఈ గ్రహణాల ప్రభావంతో బాగ్దాద్‌లో పేలుడు జరిగి 500 మంది మరణించారు.

– 01 ఆగస్టు 2008లో సూర్య గ్రహణం, 16, ఆగస్టు 2008లో చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. శ్రావణమాసంలో వచ్చిన ఈ గ్రహణాల ప్రభావంతో భారత దేశంలో ముంబయ్‌లో బాబు పేలుళ్లు జరిగాయి. నవంబర్‌ 26, 27, 28 తేదీల్లో జరిగిన వరుస పేలుళ్లతో 300 మంది వరకు మరణించారు. వీటి ఆధారంగానే బొబాయి సినిమా కూడా వచ్చింది.

– 31, డిసెంబర్‌ 2009లో చంద్రగ్రహణం, 15, జనవరి 2010లో సూర్య గ్రహణం ఏర్పడ్డాయ. పుష్యమాసంలో వచ్చిన గ్రహణాలతో హైతీ నగరంలో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో 2 లక్షల మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు.

ఒకే నెలలో వరుస గ్రహణాలు ఏర్పడడం ద్వారా జరిగే నష్టానికి ఇవి కొన్ని ఉదాహరణలని పండితులు చెబుతుండగా శాస్త్రవేత్తలు కూడా ఏకీభవిస్తున్నారు.

వరుస గ్రహణాలు..
ఈఏడాది అక్టోబర్‌ 252న సంపూర్ణ సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణం వచ్చాయి. వీటి ప్రభావంతో జరిగే నష్టాలు కూడా ఎక్కువా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, చైనా, తైవాన్, అమెరికా, చైనా, భారత్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధాలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వాయు ప్రమాదాలు, అగిన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular