https://oktelugu.com/

Wiral Pic : పెళ్లి చేసుకునేది అందుకేనట.. ఆయన సమాధానం మాములుగా లేదుగా..

పాశ్చాత్య దేశాల సంస్కృతికి అలవాటు పడి సాంప్రదాయాలను మరిచిపోతున్నారు. దీంతో పెళ్లి అనే దానిపై నేటి యువతకు విభిన్న అభిప్రాయాలున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : February 24, 2024 / 03:52 PM IST

    marriage

    Follow us on

    Wiral Pic : పెళ్లంటే నూరేళ్ల పంట అని కొందరు పెద్దలు అంటారు..అది ఒక జీవితంలో పెద్ద బాధ్యత అని మరికొందరు అంటారు.. రెండు మనసుల కలయిక పెళ్లితోనే అని ఇంకొందరు అంటారు.. కానీ నేటి కాలంలో పెళ్లిపై అభిప్రాయాలు మారుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే రెండు కుటుంబాలు సంబంధాలు ఏర్పరుచుకొని జీవితాంతం సాగే ప్రయాణంలా భావించారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పెళ్లి క్రతువుపై పెద్దగా పట్టించుకోవడం లేదు. పాశ్చాత్య దేశాల సంస్కృతికి అలవాటు పడి సాంప్రదాయాలను మరిచిపోతున్నారు. దీంతో పెళ్లి అనే దానిపై నేటి యువతకు విభిన్న అభిప్రాయాలున్నాయి. ఇందులో భాగంగా ఓ కుర్రాడిని పెళ్లి గురించి అడిగితే వింత సమాధానం ఇచ్చాడు. ఇప్పుడిదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    పెళ్లి అంటే ఒకప్పుడు అమ్మాయిలకు భయం ఉండేది. కానీ దీనిపై అవగాహన పెరిగిన కొద్దీ ఇప్పుడు అమ్మాయి, అబ్బాయిలు ఎంతో ఇష్టపడి చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు సాగితే.. ఇప్పుుడు పెళ్లిచేసుకోబోయే ఇద్దరు ఇష్టఇష్టాలతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఓ పాఠశాలలపై పెళ్లి ఎందుకు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం రాయాలని టీచర్ చెప్పింది. దీనికి ఆ కుర్రాడు చెప్పిన సమాధానం చూసి షాక్ అయింది.

    ఇంతకీ ఆ స్టూడెంట్ ఏం రాశాడంటే.. ‘ తల్లిదండ్రులు ఇంతకాలం తమ పిల్లలకు తిండి పెట్టాము.. ఇక పెట్టలేము.. అందువల్ల ఒక అబ్బాయిని చూసి అతనిని పెళ్లి చేసుకోమని చెబుతారట. తాము పెద్దవాళ్లవయ్యాము కాబట్టి ఇక నుంచి అతని వద్ద తినాలని అంటారట. అటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలాగే చెబుతారట. ఇలా రెండు కుటుంబాల వారు బాగా ఆలోచించి ఇద్దరు వ్యక్తులను కలిసి వారికి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేస్తారట. ఇక అప్పటి నుంచి వారు సొంతంగా పనిచేసుకొని బతకడం స్టార్ట్ చేస్తారట’..

    ఈ సమాధానం చూసిన టీచ్ నాన్సెన్స్ అని రాసింది. పెళ్లిపై నేటి కాలంలోని పిల్లల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ఈ సమాధానం ద్వారా తెలుస్తుంది అని కొందరు అంటున్నారు. అయితే దీనిని చూసి కొందరు నవ్వుకోగా.. మరికొందరు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదీ ఏమైనా ఈ సమాధానం చూసిన వారు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.