Wimbledon 2023: మన దగ్గర క్రికెట్ ఎంత ఫేమసో.. ఇంగ్లీష్ దేశాల్లో వింబుల్డన్ అంత ఫేమస్. ఆ ఆట ఆడేందుకు ఎంతో మంది క్రీడాకారులు దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. ప్రైజ్ మనీ కూడా దండిగానే ఉంటుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నది కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ టోర్నీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.. ప్రకటనలు, ప్రసార హక్కుల ద్వారా నిర్వాహకులకు భారీగా ఆదాయం వస్తుండటంతో ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తారు.. ఏటికేడు ఈ టోర్నీ మరింత పాపులారిటీ సంపాదించుకోవడంతో ఆటగాళ్లకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తారు. మైదానంలో ఆడే సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం ఏకాగ్రత పొందేందుకు క్వైట్ రూమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ కూడా. అయితే ఈ గదులను ఉపయోగించడంలో ఆటగాళ్లు దారి తప్పారు. దీంతో ఒక్కసారిగా ఈ గదులకు సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా టెన్నిస్ లో నాలుగు గ్రాండ్ స్లామ్ లు ఉంటాయి. అందులో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడి నిర్వాహకులు కొన్ని కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. ఇక తాజాగా వింబుల్డన్ సోమవారం నుంచి ప్రారంభమైంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో మ్యాచ్ లు జరిగే కోర్టుల వద్ద క్వైట్ రూమ్స్ ను నిర్వాహకులు ఆనవాయితీ ప్రకారం ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ గదులను ఆటగాళ్లు, ఇతర వ్యక్తులు ప్రార్థనలు, ఏకాగ్రత పొందేందుకు మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉంది. కానీ గత ఏడాది ఈ గదులలో వింబుల్డన్ గ్రాండ్ జరిగిన సమయంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్టు నివేదికలు వచ్చాయి. కొంతమంది ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనగా, మరి కొంతమంది తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపినట్టు సమాచారం.. ముఖ్యంగా కోర్టు 12 కు సంబంధించి ఆనుకుని ఉన్న క్వైట్ రూమ్ లో ఈ తరహా సంఘటనలు జరిగాయని నిర్వాహకుల దృష్టికి వచ్చింది.
అందుకే ఈసారి వింబుల్డన్ గ్రాండ్ స్లాబ్ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. క్వైట్ రూమ్స్ లో ఆ సాంఘిక కార్యకలాపాలు సాగిస్తే చర్యలు తీసుకుంటామని ఆటగాళ్లకు, ఇతరులకు ముందే హెచ్చరికలు జారి చేశారు. క్వైట్ రూమ్స్ ను కేవలం మెడిటేషన్స్, ప్రార్థనల కోసమే ఉపయోగించాలని, వ్యక్తిగత పనులు చేసేందుకు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు.. ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందించారు..” క్వైట్ రూమ్ అనేది వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో ఎప్పటి నుంచో ఉన్న నిబంధన. అక్కడ మనసు ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థనలు మాత్రమే చేయాలి. ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదు. అలాగే తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశాం. సహృదయతో ఏర్పాటుచేసిన ఈ గది సౌకర్యాన్ని సరైన మార్గంలో వినియోగించాలి” అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా, క్వైట్ రూమ్ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో..ఆటగాళ్ళు ఆట కోసమే కాదు.. సుఖం కోసమూ వింబుల్డన్ ను ఉపయోగించుకుంటున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
The prayer room @Wimbledon near court 12 is being used for sex pic.twitter.com/1ekvVXJBBM
— John Book (@JohnBook007) July 3, 2023