Sunil Chhetri: భారత పురుషుల ఫుట్ బాల్ జట్టులో లెజెండ్ గా పేరుగాంచాడు సునీల్ చెత్రీ. భారత్ ఫుట్ బాల్ జట్టు అంటే సునీల్ చెత్రీ.. సునీల్ చెత్రీ అంటే భారత్ ఫుట్ బాల్ జట్టు అన్నంతగా ముద్రను వేసుకున్నాడు. రెండు దశాబ్దాలపాటు భారత జట్టును ముందు నడిపిస్తున్నాడు ఈ లెజెండ్ ఆటగాడు. తాజాగా శాఫ్ టోర్నమెంట్ విజేతగా భారత జట్టును తొమ్మిదో సారి నిలపడంలో సునీల్ చెత్రీ పాత్ర అనిర్వచనీయమైనది.
ఇండియా ఫుట్ బాల్ జట్టులో లెజెండ్ ఆటగాడిగా పేరుగాంచాడు సునీల్ చెత్రీ. రెండు దశాబ్దాలుగా భారత ఫుట్ బాల్ జట్టు గొప్ప విజయాలను నమోదు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు సునీల్ చెత్రీ. భారత జట్టు తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా తన పేరిట రికార్డు నమోదు. భారత జట్టు విజయాల వెనక చెత్రీ ఉంటాడని అభిమానులు బలంగా విశ్వసిస్తారంటే.. అతడి ఆటతీరు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం..
అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ చెత్రీ.. ఆట తీరుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. లక్షలాది మంది అభిమానులు సునీల్ చెత్రీ ఆట చూసేందుకు మైదానాలకు వస్తుంటారు. సునీల్ చెత్రీ కూడా తన ఆటతీరుతో అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. సున్నితంగా ఇప్పటి వరకు ఆడిన 140 అంతర్జాతీయ మ్యాచుల్లో 92 గోల్స్ కొట్టి.. భారత్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇకపోతే అత్యధిక గోల్స్ చేసి యాక్టివ్ ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు సునీల్. ఫుట్ బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీ మాత్రమే సునీల్ చెత్రీ కంటే ముందంజలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు చెత్రీ. క్లబ్, దేశం తరఫున మొత్తంగా 244 గోల్స్ సాధించాడు.
రికార్డులు కైవసం చేసుకున్న సునీల్ చెత్రీ..
ఫుట్ బాల్ ఆటలోకి 2002 లో మోహున్ భగవాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ గోల్ ను 2005లో సాధించాడు. అదే ఏడాది ఆడిన తొలి మ్యాచ్ లోనే దాయాది దేశం పాకిస్తాన్ పైనే మొదటి గోల్ కొట్టి రికార్డ్ సృష్టించాడు. 2011లో న్యూఢిల్లీలో జరిగిన శాఫ్ ఛాంపియన్షిప్ లో ఏడు గోల్స్ కొట్టి భారత ఫుట్ బాల్ జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. భారత ఫుట్ బాల్ జట్టు లెజెండ్ ఆటగాడు విజయన్ పేరిట ఉన్న ఆరు గోల్స్ రికార్డును ఈ మ్యాచ్ తో చెత్రీ బద్దలు కొట్టాడు. ఆ సీజన్ లో భారత్ కు కప్ అందించడంలో కీలకంగా వ్యవహరించాడు సునీల్ చెత్రీ. సునీల్ చెత్రీ భారత జట్టు తరఫున, ఇతర లీగ్ జట్లు తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు సాధించి, ఘనతలు సాధించాడు. 2012లో పోర్చుగల్ క్లబ్ స్పోర్టింగ్ సిపి రిజర్వ్ టీమ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. భారత తరఫున భారతలో జరిగే మేజర్ ఫుట్ బాల్ లీగుల్లో పాల్గొని తనదైన ముద్ర వేశాడు. ఈస్ట్ బెంగాల్ (2008-2009), డెంపో (2009 -10), ఇండియన్ సూపర్ లీగ్ లో ముంబై సిటీ ఎఫ్సి (2017-16), బెంగళూరు ఎఫ్సీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. బెంగళూరు తరఫున 2014, 2016 సంవత్సరాల్లో ఐ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్, సూపర్ కప్ (2018) అందించాడు. అలాగే, బెంగళూరు క్లబ్ ను 2016లో ఏఎఫ్సి కప్ ఫైనల్ కు తీసుకెళ్లాడు. భారత జట్టుకు 2007, 2009, 2012 సంవత్సరాల్లో నెహ్రూ కప్, 2011, 2015, 2021 సంవత్సరాల్లో దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్ ఛాంపియన్ షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2008లో ఏఎఫ్సి ఛాలెంజ్ కప్ లో జట్టు తరఫున కీలకపాత్ర వహించి, 27 ఏళ్ల ఏఎఫ్సి ఆసియన్ కప్ కి అర్హత సాధించడంలో సాయపడ్డాడు. సికింద్రాబాద్ లో పెరిగిన సునీల్ చెత్రీ భారత జట్టుకు కెప్టెన్ గా ఉంటూ ప్రస్తుతం జరుగుతున్న శాప్ కప్ లో హ్యాట్రిక్ గోల్స్ తో అదరగొట్టి భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.