Maa TV- Sudigali Sudheer: రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక మెజిషియన్ గా మొదలైన సుధీర్ ప్రస్థానం.. ఇప్పుడు ఒక మంచి కమెడియన్ గా, యాంకర్ గా.. హీరోగా చేసే వరకూ ఎదిగింది. అతడు కష్టాలు, కన్నీళ్లను దిగమింగుకొని ఈస్థాయికి ఎదిగాడు. అందుకే ఎందరు ఎగతాళి చేసినా.. పంచులేసినా.. వ్యక్తిత్వ హననం చేసినా సుధీర్ లో కోపం అన్నది ఇప్పటికీ బయటపడలేదు. మనం చూడలేదు. కష్టం విలువ తెలిసినవాడు కాబట్టే అన్నీ మీదేసుకున్నాడు. ఎంత ఎదిగినా కూడా అంతే ఒద్దికగా ఉన్నాడు. అదే సుధీర్ విజయ రహస్యం. కానీ అన్నివేళలా ఒకటే ఫార్ములా అన్నది పనికిరాలేదు.
సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యువరాజు. మన్మథుడు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈటీవీ సుధీర్ ను అలా మార్చేసింది. ఇప్పుడు మాటీవీ కూడా అదే మూసలో వెళుతోంది. ఇటీవల ‘అంటే సుందరానికి’ అంటూ మాటీవీలో ప్రారంభమైన ఒక షోలో 8 మంది అందమైన సుందరాంగులను పిలిపించి సుధీర్ కు స్వయంవరం నిర్వహించారు. అందులో ఆడోళ్ల పిచ్చోడిగా.. కామ పిశాచిలా.. కామంతో రగిలిపోయే యువరాజుగా సుధీర్ ను ప్రొజెక్ట్ చేశారు. కామెడీ వరకూ ఓకే కానీ.. ఇదే అతడిపై ముద్రపడి రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఈటీవీ అదే పనిచేసింది. ఇప్పుడు మాటీవీ కూడా సుధీర్ లోని భిన్న పార్శ్వాలను ఆవిష్కరించకుండా అదే స్త్రీలోలుడిగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని సుధీర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
‘స్టార్ మా’లోకి వచ్చిన కొత్తలో సుధీర్ కు పెద్దపీట వేశారు. ధన్ రాజ్, వేణులాంటి సీనియర్లు, అనసూయ లాంటి నంబర్ 1 యాంకర్ ఉన్నా కూడా వారందరినీ పక్కనపెట్టి సుధీర్ తోనే యాంకరింగ్ చేయించి తొలి షోను విజయవంతం చేశారు. ఇక పాటల ప్రోగ్రాంకు కూడా సుధీర్ ను యాంకర్ ను చేసి అతడిలోని గానామృతాన్ని పంచారు. రెండూ మూడు ప్రోగ్రాంల వరకూ బాగానే సాగిన మాటీవీ ప్రయాణం మళ్లీ గాడితప్పింది. ఇప్పుడు మళ్లీ సుధీర్ ను ‘ప్లే బాయ్’గా చూపించేలా ప్రోగ్రాంలు రూపొందిస్తున్నారు. ఎంతసేపు అదే పాత చింతకాయపచ్చడి రొట్టకొట్టుడు వల్ల అటు సుధీర్ కు డ్యామేజ్ జరుగుతోంది. ఇటు ప్రేక్షకులకు కొత్తదనం లేకుండా పోతోంది. ఈటీవీలాగానే మాటీవీకి చెడ్డపేరు వస్తోంది.
‘వాడుకున్నోళ్లకు వాడుకున్నంత’.. ఇది మన సుడిగాలి సుధీర్ లోని టాలెంట్ మహిమ. కానీ దాన్ని సరిగ్గా వాడుకుంటేనే అతడికి, టీవీ యాజమాన్యాలకు గుర్తింపు, గౌరవం, డబ్బులు వస్తాయి. ఏదో ఒక మూసలో వాడితే మాత్రం అందరూ అభాసుపాలవుతారు. ఈటీవీలో సుడిగాలి సుధీర్ మరీ బ్యాడ్ చేసేసింది ‘మల్లెమాల సంస్థ’. స్కిట్ లలోనూ సుధీర్ తో కామెడీ చేయించడం కోసం అదే కాన్సెప్ట్ వాడడంతో అప్పటికి నవ్వులు పూసినా సుధీర్ పై ఆ చెరగని మచ్చ అలాగే ఉంది. సుధీర్ క్యారెక్టర్ నిజంగా బయట అలా ఉంటుందో లేదో తెలియదు కానీ మొత్తానికి బ్యాడ్ అయిపోయాడు. . ఇప్పుడు సుధీర్ ను అలాంటోడే అని అనుకుంటూ చాలా మంది పిల్లను ఇవ్వడానికి కూడా భయపడిపోతున్నారట.. సుధీర్ కు పెళ్లి అవుతుందో లేదోనన్న టెన్షన్ కూడా వారి ఫ్యామిలీకి పట్టుకుందట.. ఈటీవీ నుంచి సుధీర్ బయటకు రావడానికి ఇది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని ప్రచారం సాగింది. ఇక రెమ్యూనరేషన్ గొడవలు ఉన్నాయి.
సుడిగాలి సుధీర్ ఒక మల్టీ టాలెండెడ్ పవర్ హౌజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెజిషియన్, డాన్సర్, కమెడియన్, సింగర్… అన్నింటిలోనూ మంచి పెర్ఫార్మన్స్ ఇస్తాడు. వీటితోపాటు ఒక హీరో మెటీరియల్ కూడా. ఈ యాంగిల్స్ అన్నీ ఈటీవీలో కొద్ది కొద్దిగా చూపించినా ఇంకో సుధీర్ లో తెలియని ఎంతో టాలెంట్ ఉంది. మల్లెమాల సుధీర్ ని కేవలం అమ్మాయిల వ్యసనుడిగా ప్రొజెక్ట్ చేసింది. అది కొంతవరకు క్లిక్ అయింది. అది బోర్ కొడుతున్న సమయంలో సుధీర్ బయటకు వచ్చాడు. ఈ సెగ్మెంట్ లో ఈటీవీకి, మల్లెమాల కి గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న మాటీవీకి ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది. సుధీర్ ను వాడుకొని షోలు రక్తికట్టించాలని మొదట్లో మంచిగానే ప్లాన్ చేసింది. ఈమధ్య హొలీకి ‘తగ్గేదేలే’ ప్రోగ్రాం లో సుధీర్ సింగింగ్ టాలెంట్ కి ఒక మంచి అవకాశం ఇచ్చింది మాటీవీ. అది సూపర్ హిట్ అయ్యింది. కానీ, ఇతర ప్రోగ్రామ్స్ లో మళ్లీ అదే అమ్మాయిల పిచ్చి కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చింది.
మల్లెమాల బాటలోనే మాటీవీ నడుస్తోంది. ఏమాత్రం సృజనాత్మకంగా ఆలోచించడం లేదు. సుధీర్ ను అందరూ ఎగతాళి చేయడాన్ని అతడి ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. అందుకే మాటీవీ డిఫెరెంట్ గా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి సుధీర్ టాలెంట్స్ అన్నింటినీ బయటకు తీసుకురాగలిగితే జనాలకి మంచి ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. మాటీవీ కూడా సక్సెస్ అవుతుంది. ఆ దిశగా చేస్తేనే సుధీర్ కు, మాటీవీకి, ప్రేక్షకులకు మంచిది. లేదంటే మూసలో పడి ఆ షోలు, మాటీవీ రేటింగ్ కూడా పడిపోవడం ఖాయమని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read:Liger Movie: షాకింగ్..లైగర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు