Fact Check: సామాజిక మాధ్యమాలతో చాలా సమస్యలు వస్తున్నాయి. పనికొచ్చే విషయాలను కాకుండా పనికిమాలిన విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఏవో నమ్మశక్యం కాని వాటిని గ్రూపుల్లో పెడుతూ పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజల్లో లేనిపోని భయాలను సృష్టిస్తున్నారు. దీంతో పరిస్థితులు చేయి దాటిపోయే స్థితికి చేరుతున్నాయి. లేనిపోని ఫోబియాలు కలిగించేందుకు కారకులవుతున్నారు. మంచి విషయాలను ఎవరు పట్టించుకోరు. చెడు విషయాలపై మాత్రం ఫోకస్ పెడుతుంటారు. దీంతోనే ఎన్నో అనుమానాస్పద విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించి ఇబ్బందులు తెస్తున్తున్నాయి.

తాజాగా వాట్సాప్ గ్రూపులో ఓ విషయం తెగ వైరల్ అవుతోంది. ఓ విష పురుగు కుడితే మనిషి ఐదు నిమిషాల్లోనే చనిపోతాడని ఫేక్ పోస్టు పెడుతున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఆ పురుగు పట్ల జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. ఇంతకీ ఏంటా కథ? ఏ పురుగు అని ఆరా తీస్తే అది ఎక్కువగా చెరుకు, పండ్ల తోటల్లో ఉంటుందట. అది కుడితే చనిపోతారని ఓ తప్పుడు కథనం ప్రసారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించడం మామూలే. ఇదంతా వట్టిదేనని తేల్చుతున్నారు.
Also Read: Gautam Adani: ప్రధాని జిగ్రీ ఫ్రెండ్ ప్రపంచంలోనే నంబర్.2.. మోదీ పాలనలోనే ఎలా ఎదిగాడబ్బా!?
ఈ పురుగు పత్తి చేలలో ఉండదని చెబుతున్నారు. ఇది కుడితే దురద, మంట మాత్రమే వస్తుందని ప్రాణహాని మాత్రం ఉండదని తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేయడమే ధ్యేయంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో వచ్చినవన్ని నిజాలు అని నమ్మడం కూడా అమాయకత్వమే. ఇందులో తప్పుడు సంకేతాలిచ్చే వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా అనవసర విషయాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టడం కామనే.

ఇప్పటికైనా అనవసరమైన వాటి మీద కాకుండా అవసరమైన వాటి మీద ఫోకస్ పెడితే ప్రయోజనం ఉంటుంది. కానీ మన వారికి ఏది అనవసరమో దానికే ఎక్కువ విలువ ఇవ్వడం పరిపాటే. దీంతో చాలా సమయాల్లో గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడిన సందర్భాలు సైతం ఉండటం గమనార్హం. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి వాటి ద్వారా ఇలాంటి పనికిమాలిన విషయాలు ప్రసారం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. దీనికి కొందరు వంత పాడటం వారి తెలివి తక్కువతనానికి నిదర్శనం.