
Ramoji Rao- KCR: “ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు బెయిల్ నిరాకరించిందని” అనే వార్తను ఇవాళ నమస్తే తెలంగాణ తప్ప మిగతా పేపర్లన్నీ దానిని ప్రచురించాయి. చంద్రబాబు మినహా మిగతా అన్ని వార్తల్లో పక్కా ప్రొఫెషనలిజం ప్రదర్శించే ఆంధ్రజ్యోతి వార్తను వార్త లాగానే ప్రచురించింది. కవిత పేరు చాలాసార్లు ప్రస్తావించారని, ఆమె అరెస్టు కూడా ఖాయమని కుండ బద్దలు కొట్టింది. ఇదే వార్తకు సంబంధించి ఈనాడు రాసిన విధానం డిఫరెంట్ గా ఉంది. ఇక ఆ నమస్తే తెలంగాణ దృష్టిలో అసలు మద్యం స్కాం లేదు. దానిపై విచారణలు లేవు, దర్యాప్తుల్లేవు. కెసిఆర్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు. కెసిఆర్ బిడ్డ కేసు కాబట్టి, వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దాని జోలికి పెద్దగా పోదు.
జర్నలిజంలో నేను తోపు తురుము అని చెప్పే ఈనాడు ఎవరూ బెయిల్ కు అర్హులు కారు శీర్షికతో బ్యానర్ వార్త రాసింది. కేసీఆర్ అంటే భయం వెన్నాడుతూనే ఉంది.. కాబట్టి ఉత్తర్వుల్లో కవిత పేరును నాలుగుసార్లు ప్రస్తావించిన వైనాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. రన్నింగ్ మ్యాటర్ లో ఉంది గాని… డెక్కుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా జగన్ పేరు తీసుకొచ్చింది. ఆ తీర్పులో జగన్ కేసును ఉదాహరణగా తీసుకుంది అనేది ఈనాడుకు ప్రధానమైపోయింది . వారేవా ఏం జర్నలిజం? నిజానికి ఈ తీర్పులో జగన్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు కోర్టు ఏమీ చేయలేదు. బెయిల్ ఇవ్వడంలో జాగ్రత్తలను పేర్కొంటూ జగన్ కేసును, మరో కేసునూ ప్రస్తావించింది. జగన్ మీద మళ్లీ ఏదో కోర్టు వ్యతిరేకంగా మాట్లాడింది అనుకునేలా ఈనాడు ప్రాధాన్యం, రాసిన తీరు ఉన్నాయి.. ఇలాంటప్పుడు ఆ విషయాన్ని కంటెంట్ లో మాత్రం రాస్తే సరిపోయేది.

వార్తకు సంబంధించి ఆంధ్రజ్యోతి ప్రజెంటేషన్ చాలా బాగుంది.. జగన్ పై అకారణ ద్వేష విషయాన్ని చిమ్మే పత్రిక కానీ ఈ కేసు, ఈ తీర్పుకు సంబంధించి జగన్ పేరును ప్రస్తావించడం కన్నా, తీర్పులో కవిత పేరు నాలుగు సార్లు ఉందనే అంశాన్ని ప్రధానంగా పబ్లిష్ చేసింది. ఇది సరైన ప్రాధాన్యమే ఎందుకంటే… మద్యం స్కాన్ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టు అయ్యారు. వాళ్లకు బెయిల్లు లేవు. బయట ఉన్నది కవిత మాత్రమే. ఒకవేళ ఆమె అరెస్ట్ అయితే దానికి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంటుంది.
అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పరోక్షంగా ఆంధ్రజ్యోతి ఆ తీర్పు వార్త ద్వారా చెబుతోంది. నిజంగానే కవితను అరెస్టు చేయాల్సి ఉంటే సిబిఐ ఎందుకు వెనుకడుతోంది అనేది ప్రశ్నే. కేంద్రం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోందా? కేంద్రంలోని బిజెపి కూడా కేసీఆర్ పట్ల రాజకీయ ప్రత్యర్థత్వాన్నే కనబరుస్తోంది. పైగా కవితలు అరెస్టు చేస్తే కేసీఆర్ కుటుంబాన్ని కూడా బద్నాం చేసేందుకు బిజెపికి ఉపయోగపడే కేసు అవుతుంది. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి తారతే అవకాశాలు ఉన్నాయని సందేహిస్తుందా బీజేపీ? తెలంగాణ రాజకీయాల్లో ఇంపార్టెంట్ కేసు కాబట్టి ఆంధ్రజ్యోతి ప్రయారిటీస్ చాలా కరెక్ట్. మిగతా దినపత్రికల ప్రయారిటీలు చాలా తప్పు. సాక్షి ఇలాంటి విషయాల్లో కనబరుస్తున్న వైఖరి కూడా ప్రొఫెషనల్ బ్లండరే… అది మరో నమస్తే తెలంగాణ అయిపోయింది.