Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున తీరు అంతుపట్టడం లేదు. పరిశ్రమ పెద్దలు మరణిస్తే ఆయన చివరి చూపుకు వెళ్ళకపోవడం విమర్శల పాలవుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నాగార్జున పరిశ్రమలో ఉన్నారు. పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనే. వంద సినిమాలకు దగ్గరపడిన నాగార్జున, పరిశ్రమలో ప్రతి నటుడితో అనుబంధం కలిగి ఉన్నారు. కైకాల సత్యనారాయణతో ఆయన పదుల సంఖ్యలో కలిపి చిత్రాలు చేశారు. నాగార్జున సినిమాల్లో సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్, కమెడియన్ గా విలక్షణ పాత్రలు చేశారు. అంతకు మించి నాగార్జున తండ్రిగారైన ఏఎన్నార్ కి కైకాల మిత్రుడు.

అలాంటి కైకాల మరణిస్తే నాగార్జున స్పందించలేదు. చివరి చూపు చూసేందుకు వెళ్ళలేదు. కనీసం సోషల్ మీడియాలో ఆయన మృతిపై సంతాపం తెలపలేదు. అలాగే సెప్టెంబర్ 11న కృష్ణంరాజు మరణించారు. అప్పుడు కూడా నాగార్జునది అదే తీరు. ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్ పెట్టలేదు. కృష్ణంరాజును చివరి చూపు చూసేందుకు వెళ్ళలేదు. కృష్ణంరాజు మరణించిన రెండు నెలలకు నవంబర్ 15న కృష్ణ మరణించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మరణించినా నాగార్జున భౌతికకాయం సందర్శించలేదు.
అయితే ఒక ట్విట్టర్ పోస్ట్ మాత్రం పెట్టారు. తన సంతాపం ప్రకటించారు. మరణించిన వ్యక్తులను చివరి చూపు చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే వారిని మనం ఇకపై చూడలేం. శరీరం పంచభూతాల్లో కలిపేస్తాం కాబట్టి… మరణంతో దూరమైన వ్యక్తుల భౌతికకాయం సందర్శించి నివాళులు అర్పించడం సాంప్రదాయంగా ఉంది. ఈ నియమాన్ని నాగార్జున పాటించడం లేదు. మనకంటే వయసులో అనుభవంలో పెద్దవారు, మార్గదర్శకులకు ఇచ్చే కనీస గౌరవం అది.

ఇలా చిత్ర ప్రముఖలు మరణించినప్పుడు చివరి చూపుకు వెళ్లకుండా తప్పించుకోవడం వలన విమర్శలు వస్తాయని నాగార్జునకు తెలుసు. అయినా నాగార్జున వెళ్లడం లేదు. ఈ క్రమంలో నాగార్జునకు చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా? లేక పార్దీవ దేహాలను సందర్శించడం అపశకునంగా భావిస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ భిన్నం. కృష్ణంరాజు, కృష్ణ చనిపోయినప్పుడు వారి భౌతిక కాయలను సందర్శించి… ప్రభాస్, మహేష్ లకు మనోధైర్యం చెప్పారు.