Ivory: వీర్పన్.. ఈ పేరు వినగానే గందపు చెక్కల దొంగ గుర్తొస్తాడు. దాదాపు రెండ దశాబ్దాలు అడవిని ఏలిన వీరప్పన్ గంధపు చెక్కలతోపాటు ఏనుగు దంతాలు, జంతువుల చర్మాలు స్మగ్లింగ్ చేసేవాడు. అడవిలోనే ఉంటూ.. అధికారులకు చిక్కకుండా స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అంటే స్మగ్లింగ్ ద్వారా అంత ఆదాయం ఉంది కాబట్టే అడవిలో తిష్టవేశాడు. స్మగ్లింగ్‌లో ఎనుగు దంతాలు చాలా ఖరీదు. కానీ వీటితో ఏం చేస్తారో చాలా మందికి తెలియదు. కేజీ ఏనుగు దంతాల ధర రూ.10 లక్షల వరకు ఉంటుంది.. ఇంత ధర ఎందుకు ? వీటితో ఏం తయారు చేస్తారో తెలుసుకుందాం.
ఆభరణాల తయారీ..
ఏనుగు దంతాల వ్యాపారం చట్టవిరుద్ధం. ఈ వ్యాపారం చేస్తే.. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే ఏనుగు దంతాల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. నిజానికి చాలా దేశాల్లో ఆభరణాల తయారీకి ఏనుగు దంతాన్ని ఉపయోగిస్తారు. మెడలో వేసుకునే హారాలు, కంకణాలు, మణికట్టుకు ధరించే బటన్లు వంటివి దీని నుంచి తయారు చేస్తారు. కొన్ని వర్గాల్లో వీటిని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే.. బంగారం కంటే కూడా ఏనుగు దంతాలు అత్యంత ఖరీదు.
అంతరించిపోతున్న జాబితాలో ఏనుగు..
ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో ఏనుగు మనుగడకే ముప్పు ఏర్పడింది. దంతాలు సేకరించాలంటే ఏనుగును చంపాలి. ఇలా స్మగ్లర్లు ఏనుగులను చంపుతుండడంతో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఏనుగు చేరేలా చేసింది. ఈనేపథ్యంలో ఏనుగు దంతాల వ్యాపారాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి.
70 ఏళ్ల జీవితకాలం..
ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువే జీవిస్తుంది. వాటి లైఫ్ జీవితకాలంలో దంతాలు 6 సార్లు ఊడిపోయి మళ్లీ వస్తాయి. మనం ఏనుగుకు రెండే దంతాలు ఉంటాయని అనుకుంటాం. వాస్తవానికి పైకి కనిపించే 2 పెద్ద దంతాలే కాకుండా నోటి లోపల మరో 24 దంతాలు కూడా ఏనుగుకు ఉంటాయి. ఏనుగు పండ్లు, ఆకులు, కొమ్మలు, వేర్లు తిని బతుకుతుంది.
కష్ట జీవి..
భూకంపం వంటివి సంభవిస్తే మనుషుల కంటే ముందే ఏనుగులు గుర్తించగలవు. ఏనుగుల గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి వాటిని అప్పట్లో ఉపయోగించేవారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగులను ఉపయోగించేవారు. యుద్ధాలలో మగ ఏనుగులను ఉపయోగించేవారు. భారీ బరువులు ఎత్తడానికి, దారి మధ్యలో ఉన్న వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధ ఖైదీలను వాటి పాదాల కింద తొక్కించడానికి వాడేవారు.