
Akkineni Amala: అందం, అభినయం ఆడవాళ్ల సొంతం. వీటికి తోడు ధగధగ మెరిసే ఆభరణాల్లో మరింత మెరిపిపోతూ ఉంటారు. అందుకే చాలా మంది లేడీస్ బంగారం, ఇతర లోహాలంటే బాగా ఇష్టపడుతారు. ఇక సినిమాల్లో నటించే హీరోయిన్లయితే ఈ విషయంలో ముందుంటారు. మార్కెట్లో విలువైన ఆభరణాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించి ధరిస్తుంటారు. అయితే అక్కినేని ఇంటి కోడలు, ఒకప్పుడు హీరోయిన్ అమల మాత్రం చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఆమెపై కనీసం తులం బంగారం కూడా కనిపించదు. అమలకు డబ్బులేదనుకోం. వేల కోట్ల ఆస్తులున్నాయి. కావాల్సిన నగలన్నీ కొనుక్కొని ధరించే స్థాయి ఉంది. మరి ఆమెకు ఆభరణాలు ధరించడం ఇష్టం లేదా? అసలేందుకు ఆమె బంగారం వేసుకోవడం లేదు?
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అమల ఓ తమిళ సినిమాతో సినీ ఫీల్డులోకి వచ్చారు. ఆ తరువాత నాగార్జున నటించిన ‘చినబాబు’ సినిమాలో తొలిసారి తెలుగులో అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత వీరిద్దరు కలిసి చేసిన ‘శివ’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు అఖిల్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు దూసుకెళ్తున్నాడు.
అమల కంటే ముందే నాగార్జున డి.రామానాయుడు కూతురు శ్రీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగచైతన్య పుట్టాడు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. ఆ తరువాతే అమలను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య, అమల, అఖిల్ అంతా కలిసే ఉంటారు. అమల ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్ట్టార్ చేశారు. ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో శర్వానంద్ కు తల్లిగా నటించారు. ఇందులో ఏజ్ ఎక్కువైనట్లు కనిపించినా ఆమె పాత్రకు ప్రాధాన్యం పెరిగింది.

సినిమాల్లోనే కాకుండా అమల కొన్ని సందర్భాల్లో ఇతర కార్యక్రమాల ద్వారా బయట కనిపిస్తూ ఉంటారు. జంతు ప్రేమికురాలు అయినందున పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె మెడలో నల్లపూసల దండ తప్ప బంగారం ఎక్కడా కనిపించదు. ఎందుకు? అని చాలా మంది ఆరా తీయగా.. అమలకు స్కిన్ అలర్జీ ఉందట. ఆమె ఏ ఆభరణం ధరించినా ఆమె ముహం ఎర్రగా మారిపోతుందట. అందుకే ఆమె ఆభరణాలు ధరించడం లేదని అనుకుంటున్నారు.