Balagam Movie : బలగం ఎందుకు హిట్ అయ్యింది? అందరి హృదయాలను ఎందుకు తాకింది?

Balagam Movie : బలగం.. అదో బంధాల బాంధవ్యం. మనిషికి బంధాలు ఎంత ముఖ్యమో చెప్పిన ఒక అద్భుత చిత్రంగా చెప్పొచ్చు. చాలా మంది చూసి ఏమోషనల్ అవుతున్నారు. రివ్యూలు రాస్తుకొస్తున్నారు. ఇంతకీ బలగం ఎందుకు హిట్ అయ్యింది.? అందరినీ కదిలించిన ఆ ఇతివృత్తం ఏమిటి? ప్రతీ గుండెను తాకిన ఆ మూవీలో అసలేముందని తరిచి చూస్తే ప్రతీ మనిషి కోరుకునే బంధముందని చెప్పచ్చు. థియేటర్ లో చూసిన సినిమా ప్రభావం ఎంతగా ఉంటుందో బలగం సినిమా మరోసారి […]

Written By: NARESH, Updated On : March 27, 2023 4:26 pm
Follow us on

Balagam Movie : బలగం.. అదో బంధాల బాంధవ్యం. మనిషికి బంధాలు ఎంత ముఖ్యమో చెప్పిన ఒక అద్భుత చిత్రంగా చెప్పొచ్చు. చాలా మంది చూసి ఏమోషనల్ అవుతున్నారు. రివ్యూలు రాస్తుకొస్తున్నారు. ఇంతకీ బలగం ఎందుకు హిట్ అయ్యింది.? అందరినీ కదిలించిన ఆ ఇతివృత్తం ఏమిటి? ప్రతీ గుండెను తాకిన ఆ మూవీలో అసలేముందని తరిచి చూస్తే ప్రతీ మనిషి కోరుకునే బంధముందని చెప్పచ్చు.

థియేటర్ లో చూసిన సినిమా ప్రభావం ఎంతగా ఉంటుందో బలగం సినిమా మరోసారి గుర్తుచేసింది. కరోనా తర్వాత ఓటీటి లు వచ్చి థియేటర్ లను కోలుకొని విధంగా దెబ్బతిసాయి.. పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ లు మాత్రమే మిగిలేలా చేసింది కరోనా.. ఓటీటి లో థియేటర్ లో చూసిన అనుభవాన్ని పొందలేము.. ఇంటిల్లిపాది ఓటీటి లో పూర్తిగా సినిమా చూసిన సందర్బం కూడా చాలా తక్కువ.. ఇది అంత ఎందుకు చెప్తున్నానానంటే బలగం సినిమా నే కారణం..

ఒక కామెడియన్ దర్శకుడిగా మారి ప్రేక్షకుల కళ్ళను పలుమార్లు తడిచేలా.. ఏడ్చేలా చేయడం గ్రేట్.. వేణు ఎల్డండి తోపు డైరెక్టర్ లను మించి తీసాడు సినిమా..ఒక సాధారణ మనిషి చావును ఇతివృతం గా తీసుకోని రెండు గంటల పాటు సినిమాగా మలచడం సహసమే.. సినిమా ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన దిల్ రాజు ను ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది.. ఇక సినిమాలో పాత్రలు నటించారు అనేకంటే జీవించారో లేక సజీవం గా ఉన్నారో అనాలి.. ఎక్కడ కూడా సినిమా ఇది అనేలా అనిపించలేదు..

తెలంగాణ పల్లెలో ఒక రైతు చావు.. తధానంతర కార్యక్రమాలు మనం చావు కి వెళ్లి చూస్తున్నట్లు ఉంటుంది.. కాకి ఆ ఫలహారాలను ముట్టకపోవడం.. ఎందుకు ముట్టట్లేదో అని ఇంటి పెద్ద కొడుకు అల్లుడు పొట్లాడుకోవడం.. చనిపోయిన ముసలాయన మనవడి బాకీ బాధ.. చివరకి ఘోరి నిర్మెంచే కాడ కూడా పొట్లాట.. అన్ని సహజం గా ఉన్నాయి.. ఉన్న 3 పాటలు సందర్బచితంగా.. ఉన్నాయి.భీమ్స్ సంగీతం చాలా బావుంది..పాటల రచయిత కాశర్ల శ్యాం. బలరామ నర్సయ్యో పాట అందర్నీ ఆలోచింప చేస్తుంది.. ఊరు పల్లెటూరు పాట హృద్యం గా ఉంది.. చివర్లో వచ్చిన బుడగ జంగాల పాట.. ప్రతి ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పిస్తుంది..

ఈ మధ్య తెలంగాణ ప్రాంతం ఆచర సంప్రదాయాలు ఇతివృతం గా సినిమాలు రావడం.. విజయం సాధించడం.. ప్రతి తెలంగాణ వాసిని చాలా ఆనందానికి గురిచేస్తోంది. సినిమా జయపజయలు పట్టించుంకోకుండా సినిమాని ఇంత అద్భుతం గా తీసిన దర్శక నిర్మాతలకు ముందుగా శుభాభినందనలు..