India Vs New Zealand 3rd Odi: మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఇప్పటికే గెలుచుకుంది. మొదటి వన్డేలో గట్టి పోటీ ఇచ్చిన కివీస్..రెండో వన్డేలో చేతులు ఎత్తేసింది.. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంది. ఇక నామ మాత్రమైన మూడో వన్డేను ఇవాళ ఇండోర్ లో భారత్, కివీస్ జట్లు ఆడనున్నాయి.. మూడు నెలల క్రితం దక్షిణాఫ్రికా తో ఇక్కడ జరిగిన టి20 లో రోసో 48 బంతుల్లోనే శతకం బాదేశాడు.. అందుకే నేటి మ్యాచ్లో భారీ స్కోర్ లు నమోదయ్యే అవకాశం ఉందని పిచ్ క్యూరేటర్ చెబుతున్నారు.. అటు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయినప్పటికీ… చివరి మ్యాచ్లో గెలిచి t20 సిరీస్ ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది.

మిడిల్ ఆదుకోవాలి
ఒక మ్యాచ్లో గిల్ విజృంభించాడు.. మరో మ్యాచ్లో బౌలర్లు తడాఖా చూపారు.. ఫలితంగా భారత్ సీరిస్ పట్టేసింది. కానీ ఈ ఈ మ్యాచ్ ల్లో మిడిల్ ఆర్డర్ నుంచి సరైన స్పందన లభించలేదు. ఓపెనర్లు గిల్, రోహిత్ మాత్రమే నిలకడగా ఆడుతున్నారు. ఇషాన్, హార్దిక్, సూర్య కుమార్ యాదవ్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.. సూర్య ఈ ఫార్మాట్లో ఇంకా కుదురుకోకపోవడం జట్టును ఇబ్బందికి గురిచేస్తోంది. లెఫ్ట్ ఆఫ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. రెండు సార్లు అతడు శాంటర్న్ చేతిలో అవుట్ అవ్వడమే ఇందుకు నిదర్శనం. నాలుగు మ్యాచ్లో మూడు శతకాలు బాది సూపర్ ఫాం కనబరిచిన విరాట్… ఈ సిరీస్ లో స్వల్ప స్కోర్ లకే అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో తన లోపాలు సరిదిద్దుకోవాల్సిందే.. వర్క్ లోడ్ ను పరిగణలోకి తీసుకొని కొందరికి విశ్రాంతినిచ్చి… బ్యాటింగ్లో రజిత్ పాటిదార్, ఉమ్రాన్ మాలిక్ కు జుట్టు అవకాశం ఇస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న కివీస్ జట్టు ఈ సిరీస్ లో ఓదార్పు విజయం కోసం ఎదురుచూస్తోంది.. రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ లేకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. విధ్వంసకర బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ వారు స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఆలెన్, కాన్వే, మిచెల్, ఫిలిప్స్ భారీ షాట్లు ఆడగలిగే వారే.. ఆయినా జట్టులోని టాప్_ 6 ఆటగాళ్లు గత 30 ఇన్నింగ్స్ ల్లో ఏడుసార్లు మాత్రమే 40 + స్కోర్లు సాధించగలిగారు. బ్రేస్ వెల్, శాంట్నర్ మాత్రమే ఆకట్టుకుంటున్నారు .
విదేశీ జట్లకు నిరాశ
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చే ఏ జట్టయినా నిరాశతో వెనుదిరగాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ద్వై పాక్షిక సీరీస్ లను గెలుచుకోవడం టీం ఇండియా కు మంచి నీళ్ల ప్రాయం లాగా మారింది..2009 నుంచి సొంత గడ్డపై 27 సీరిస్ లు అడితే 24 నెగ్గడం విశేషం. 2019 నుంచి ఇక్కడ వరుసగా 7 సీరిస్ లను వశం చేసుకుంది. ఇక నేటి వన్డేలో ప్రత్యర్థికి ఓటమి రుచి చూపిస్తే ఈ ఏడాదిలో వరుసగా రెండో క్లీన్ స్వీప్ చేసినట్టు అవుతుంది.

జట్ల అంచనా ఇలా..
భారత్: రోహిత్( కెప్టెన్), గిల్, కోహ్లీ, ఇషాన్, సూర్య, హార్దిక్, సుందర్, శార్దూల్, కులదీప్/ చాహల్, ఉమ్రాన్/ షమీ, సిరాజ్.
కివీస్: ఆలేన్, కాన్వే, నికోల్స్, మిచెల్, టామ్ లాథమ్, ఫిలిప్స్, బ్రేస్ వెల్, శాంట్నర్, శిప్లే, ఫెర్గూసన్/ డఫీ, టిక్నే ర్.