Anasuya Bharadwaj: కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. పట్టుదలతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ నేడు కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లో కాస్ట్లీ ఏరియాలో సొంత ఇల్లు. లగ్జరీ కార్లు, విదేశీ టూర్లు అంటూ లైఫ్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆమె హైదరాబాద్ హాస్టల్ లో ఉండేవారు. అర్థ రూపాయి మిగల్చడం కోసం అర కిలోమీటర్ కి పైగా నడిచెళ్లి మరో స్టాప్ లో ఆర్టీసీ బస్ ఎక్కేవారు. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వాళ్ళ అమ్మ మిషన్ కుట్టి ఫ్యామిలీని పోషించేవారు. ఎంబీఏ పూర్తి చేసిన అనసూయ ఓ ప్రవేట్ బ్యాంకు లో వర్క్ చేశారు. గ్లామర్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగం చేయక తప్పలేదు. ఓ కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ గా కూడా పని చేశారు. సాక్షి టీవీలో న్యూస్ యాంకర్ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి పాల్గొన్నారు. సెలెక్ట్ అవుతానని ఆమెకు ఏమాత్రం నమ్మకం లేదట. అనూహ్యంగా ఆమెనే ఆ పోస్ట్ వరించింది. అలా కెమెరా ముందుకు వచ్చింది.
అంతకు ముందు సినిమా ప్రయత్నాలు కూడా చేసినట్లు సమాచారం. ప్రాధాన్యత లేని పాత్రలు చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సైతం వర్క్ చేశారు. మా మ్యూజిక్ ఛానల్ లో కొన్నాళ్ళు యాంకరింగ్ చేశారు. ఆ అనుభవంతో జబర్దస్త్ యాంకర్ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. 2013లో మల్లెమాల నిర్మాణ సంస్థ ప్రయోగాత్మకంగా జబర్దస్త్ కామెడీ షో స్టార్ట్ చేసింది. అనసూయ యాంకర్ గా ఎంపికైంది.ఆ పరిణామం అనసూయ కెరీర్ మలుపు తిప్పింది. ఊహించని స్థాయికి తీసుకెళ్లింది.

జబర్దస్త్ షో సక్సెస్ కావడంతో అనసూయ పాప్యులర్ అయ్యారు. గ్లామరస్ యాంకర్ గా సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. స్టార్ యాంకర్ గా ఎదిగారు. దాదాపు 9 ఏళ్లు జబర్దస్త్ షోలో పనిచేశారు. ఈ క్రమంలో నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్. దాంతో యాంకరింగ్ వదిలేసింది. కేవలం నటిగా సెటిల్ అయ్యింది. పుష్ప 2, మైఖేల్ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అనసూయ రేంజ్ అలా ఎర్ర బస్ నుండి ఎయిర్ బస్ కి మారింది.