
Sonia Singh: యూట్యూబ్ పుణ్యమాని చాలా మంది వివిధ రంగాల్లో సెటిలయ్యారు. కొంతమంది సొంతంగా ఛానెల్స్ ను పెట్టి ఫేమస్ అయ్యారు. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లేటేస్టుగా ఓ అమ్మాయి తన వీడియోలతో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఆమె నటించి రిలీజ్ చేసిన ఇవి పాపులారిటీ సాధించడంతో ఆమెకు వీపరీతంగా అభిమానులు పెరిగారు. కొన్నాళ్లపాటు ఆమె కనిపించకపోవడంతో మళ్లీ వీడియోలు చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మరోసారి కొన్ని ప్రత్యేక వీడియోలతో ఆకట్టుకుంటోంది. దీంతో ఆ అమ్మాయి ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి? అని ఆరాతీస్తున్నారు.
‘రౌడీ బేబీ’, ‘పెళ్లైన కొత్తలో’, ‘ఓయ్ పద్మావతి’ తదితర సిరీస్ లను ఆమెను గుర్తుపడుతారు. ఆమె పేరు సోనియా సింగ్. మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన సోనియా సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది. బీటెక్ పూర్తి చేసిన తరువాత ఈమె షార్ట్ ఫిలింలల్లో నటించడం ప్రారంభించింది. ఆమె మొదటిసారిగా నటించిన ‘హే పిల్ల’ అనే ఛానెల్ లోని వీడియోలు పాపురల్ కావడంతో ఫ్యాన్ష్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగారు. ఆ తరువాత కొన్నాళ్లు కనిపించకుండా పోయారు.

దీంతో ఆమె కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. మరోసారి ఆమె పేమస్ కావడంతో ఆమె గురించి తెగ చర్చించుకుంటున్నారు. యూట్యూబ్ చానెల్ లో ఫేమస్ అయిన తరువాత ఈమెకు ‘యమలీల ఆ తరువాత’ అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అయితే బుల్లితెరపై హల్ చల్ చేసిన ఈమె ఇటీవల రిలీజైన ‘విరూపాక్ష’ సినిమాలో నటించింది.
ఈ సినిమా సందర్భంగా ఆమె ఇచ్చిన స్పీచ్ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమె మరికొన్ని సినిమాల్లో నటిస్తుందని అందరు అంటున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్తుందని కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆమె నటించిన యూట్యూబ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.