Bheemla Nayak Adavi Thalli Maata: పవర్ స్టార్ మేనియా మొదలైంది. టాలీవుడ్ లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీ ప్రమోషన్ జోరు పెరిగింది. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న భీమ్లానాయక్ మూవీ నుంచి తాజాగా ‘అడవితల్లి’ పాట రిలీజ్ అయ్యి వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది.

పవన్ కళ్యాణ్ , రానా కలిసి నటిస్తున్న ‘భీమ్లానాయక్’ను టాప్ దర్శకుడు త్రివిక్రమ్ పర్యవేక్షిస్తుండగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు విడుదలై ట్రెండింగ్ సృష్టించాయి.
తాజాగా నాలుగో పాటగా ‘అడవితల్లి’ రిలీజ్ చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. తెలంగాణ ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ ఆలపించారు. తెలంగాణ యాస భాషలో ఆ మాండలికంలో పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అసలు ఈ పాట పాడింది ఎవరా అని అందరూ ఆరాతీస్తున్నారు. ఆమె పేరే ‘కుమ్మరి దుర్గవ్వ’.
Also Read: ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి నిధి తప్పుకుందా?
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గవ్వ ఒక ఫోక్ సింగర్. పంట పనులకు పోయినప్పుడు అక్కడే పాట పాడడం నేర్చుకుంది. ఆ తర్వాత జానపదాలు, కొన్ని మరాఠీ భాషలో కూడా జానపద పాటలు పాడి స్థానికంగా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో, మరాఠీలో ఈమె పాడిన పాటలు వినసొంపుగా ఉండడం చూసి తమన్ టీం సంప్రదించి ఈ స్పెషల్ సాంగ్ ను పాడించింది. అదిప్పుడు వైరల్ గా మారింది.
కుమ్మరి దుర్గవ్వ గతంలో ‘ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే’, సిరిసిల్లా చిన్నది ’ అంటూ పాడిన పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాలో పాట పడి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.
అడవితల్లి పాట
Also Read: భీమ్లానాయక్లో పవన్ గాత్రం.. రికార్డింగ్ పూర్తిచేసుకున్న పవర్‌స్టార్?