Largest Country: ప్రపంచంలో మొత్తంగా 195 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. చరిత్రలో ఎన్నో పెద్ద దేశాలు విడిపోయి చిన్న దేశాలుగా.. చిన్న దేశాలు కలిసి పెద్ద దేశాలుగా మారాయి. మరి ఇందులో ఏది పెద్దది? ఏది చిన్నది అనే ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అయితే ఇదొక సారి చదివేయండి. చిన్న దేశాల కంటే పెద్ద దేశాలు భౌగోళిక, వాతావరణ, జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ఒక ప్రాంత కోణం నుంచి చూస్తే రష్యా ప్రపంచంలో అతి పెద్ద దేశం అని తెలిసిందే.
దీనిని గతంలోనే సోవియట్ యూనియన్ అని పిలిచేవారు. దీన్ని ప్రపంచంలో మూడింట ఒక వంతు అంటారు కూడా. రష్యా ఇప్పటికీ ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపాలోని పెద్ద భాగాలపై నియంత్రణ కలిగి ఉంది. అయితే ఆసియాలో రష్యా అతిపెద్ద దేశం. దీని వైశాల్యం సుమారు 17.098 మిలియన్ చదరపు కి.మీ. ఇది భూమి మొత్తం వైశాల్యంలో 11 శాతం. అపారమైన సహజ వనరులతో నిండిన ఈ దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యం.
చమురు, గ్యాస్ అందించడం మానేస్తే.. ప్రపంచంలోని అనేక దేశాల్లో చీకటే రాజ్యమేలుతుంది. వంట చేయడం కష్టమే. ఐరోపా గ్యాస్ అవసరాలలో ఎక్కువ భాగాన్ని రష్యా సరఫరా చేస్తుంది. చైనాలాగే రష్యా సరిహద్దు కూడా 14 దేశాలతో అనుసందానమైంది. దేశ జనాభా దాదాపు 14 కోట్లు. దేశం ఖనిజ వనరులతో సమృద్దిగా ఉంది. కానీ చాలా వరకు ఇప్పటికీ ఉపయోగించరట. దాదాపు ఏడాది పొడవున మంచు పరిస్థితుల కారణంగా ఈ దేశం ప్రపంచంలోని అత్యంత శీతల దేశాలలో ఒకటి అని పేరు గడించింది.
ఇక కెనడా ప్రపంచంలోననే రెండవ శీతల దేశం అంటారు. ఉత్తర అమెరికా ఉత్తర భాగంలో ఉన్న ఈ దేశ వైశాల్యం సుమారు 9.984 మిలియన్ చదరపు కి. మీ. ఇది ఉత్తర అమెరికా ఖండంలో 41శాతం. భూమి మొత్తం వైశాల్యంలో 6.7శాతం ఆక్రమించింది. ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ.