Kalki Avatar : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ సందర్భంగా టైటిల్ పై తీవ్ర చర్చ సాగింది. ఈ మూవీకి ‘కల్కి’ అనే పేరు ఎందుకు పెట్టారు? అని కొందరు ప్రశ్నలు వేశారు. అయితే నాగ్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా భవిష్యత్ లో కల్కి ఇలాగే ఉంటాడని సరదాగా సమాధానం ఇచ్చారు. దీంతో అసలు నిజంగానే ఇలా ఉంటాడా? అని అనుకుంటున్నారు. అంతేకాకుండా అసలు కల్కి ఎందుకు అవతరిస్తాడు? ఏం చేస్తాడు? అనేది హాట్ టాపిక్ గా మారింది.
మహా విష్ణువు దశావతారాల్లో కల్కి కూడా ఉంది. కృష్ణావతారం తరువాత కల్కి అవతారం ఎత్తుతాడని పురాణాల్లో వ్యాసభగవానుడు చెప్పాడు. కల్కి అవతారంతో లోకం అంతమవుతుందని పేర్కొన్నాడు. ఈ సమయంలో పాపులను అంతం చేయడంతో ఎక్కడా మనుషులు కనిపించని పేర్కొన్నాడు. ఈ కల్కి ‘శంబాలా’అనే గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆ తరువాత కల్కిగా మారుతాడని అన్నారు. తెల్లటి గుర్రంపై సంచరిస్తూ ధర్మాన్ని నిలబడుతూ వస్తాడు. ఎక్కడా పాపం పెరిగిపోతుందో అక్కడ కల్కి ప్రత్యక్షమవుతాడని అంటున్నారు.
వ్యాసభగవానుడుతెలిపిన ప్రకారం.. కల్కి తన ప్రతాపం చూపే ముందే లోకంలో అన్నీ అనర్థాలు మొదలవుతాయి. యాగాలు ఎక్కడా కనిపించవు. గోవులను వధించడం కామన్ గా మారుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను పట్టించుకునేవారు కరువవుతారు. పురుషుల యొక్క ఆయుష్సు తగ్గిపోతుంది. మహిళలు జడలు, సికముడుచుకోవడం మానేసి కేశాలు ఆరోబోసుకుంటారు. దీంతో సంప్రదాయాలువిచ్చిన్నమవుతాయి. పురుషులు 18 ఏళ్లకే మరణించడం ప్రారంభమవుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా భంగధర అనే వ్యాధి ప్రభలుతుంది. ఈ వ్యాధితో ఎక్కడివారక్కడే మరణిస్తారు. అయితే కొందరు దాన ధర్మాలు పాటించేవారు, పుణ్యం చేసేవాళ్లు మాత్రం తమ జీవితాంతం ఉంటారు. ఇక అర్హత లేని వారు రాజ్యమేలుతారు. వీరి వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతుంది. ఈ క్రమంలో కల్కి తెల్లని గుర్రంపై సంచరిస్తూ పాపాలను హరిస్తూ వస్తాడు. చివరికి భూమండలం సముద్రంలో కలిసిపోతుంది… అని పండితులు చెబుతున్నారు.